Kamala Harris : కమలా హ్యారిస్ మళ్లీ పోటీ చేస్తారా ? నెక్ట్స్ టార్గెట్ ఏమిటి ?

అయితే దీనిపై ఇంకొన్ని వారాల్లో కమల(Kamala Harris) అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం.

Published By: HashtagU Telugu Desk
Kamala Harris Us President 2028 Us Polls Presidential Polls

Kamala Harris : భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ గతంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా సేవలు అందించారు. ఆమెను చూసి యావత్ భారతీయులు గర్వించారు. ఇటీవలే జరిగిన అమెరికా  అధ్యక్ష ఎన్నికల్లోనూ కమల పోటీ చేశారు. అయితే విజయం మాత్రం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌నే వరించింది.  కమల ప్రాతినిధ్యం వహించే డెమొక్రటిక్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష స్థానంలో ఉంది.  దీంతో తదుపరిగా కమల ఏం చేయబోతున్నారు ? 2028 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారా ? అనే దానిపై కీలక అప్‌డేట్స్ వచ్చాయి. అవేంటో చూద్దాం..

Also Read :Panch Vs Pati : భర్త చాటు భార్యలు.. మహిళా వార్డు సభ్యులకు బదులు భర్తల ప్రమాణం

కొత్త పదవి కోసం రేసు

కమలా హ్యారిస్ తదుపరిగా ఒక కీలకమైన పోస్టు కోసం పోటీపడుతున్నారు.  కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ పదవి రేసులో ఆమె ఉంటారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకొన్ని వారాల్లో కమల(Kamala Harris) అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. డెమొక్రటిక్ పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన తర్వాత దీనిపై ఆమె తుది నిర్ణయం తీసుకుంటారట. ప్రస్తుతం కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌గా  డెమొక్రటిక్ పార్టీ నేత గావిన్ న్యూసమ్ ఉన్నారు. ఈసారి జరిగే రాష్ట్ర గవర్నర్ ఎన్నికల్లోనూ ఆయన డెమొక్రటిక్ పార్టీ నుంచి అభ్యర్థిత్వం కోసం పోటీపడే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే కమలా హ్యారిస్‌కు మార్గం క్లిష్టతరం అవుతుంది. అందుకే తొందరపాటుతో దీనిపై ప్రకటన చేసేందుకు కమల వెనుకంజ వేస్తున్నారు.  గత కొన్ని దశాబ్దాలుగా కాలిఫోర్నియా వాసులు డెమొక్రటిక్ పార్టీ వైపే మొగ్గుచూపుతున్నారు. ఈసారి కూడా అలాగే జరుగుతుందా ? లేదా ? అనేది వేచిచూడాలి. ఒకవేళ కమలకు పోటీ చేసే అవకాశం లభించినా, ఓడిపోతే చాలా ప్రతికూలమైన అంశంగా నిలిచిపోతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన కమల, ఇప్పుడు గవర్నర్ పదవికి జరిగే పోటీలోనూ ఓడిపోతే మైనస్ పాయింటుగా ట్రాక్ రికార్డులో చేరుతుందని అభిప్రాయపడుతున్నారు.

Also Read :Child Trafficking Gang: పిల్లలను అమ్మే ముఠా కలకలం.. కొత్త అప్‌డేట్స్

2028లో దేశాధ్యక్ష పదవికి .. ?

మొత్తం మీద, కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ చేయాలనే ఆసక్తి తనకు ఉందనే సంకేతాలను కమల పంపారు. తద్వారా 2028 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటాననే సిగ్నల్స్‌ను ఆమె ప్రజల్లోకి పంపారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఏకంగా దేశాధ్యక్ష పదవికి పోటీ చేసిన కమల, మళ్లీ చిన్నస్థాయి పదవి కోసం పోటీపడటం అనేది అంత మంచి నిర్ణయం కాదని సూచిస్తున్నారు.

  Last Updated: 08 Mar 2025, 01:53 PM IST