Heart Attack: 40వేల అడుగుల ఎత్తులో ఉండగా.. హార్ట్ ఎటాక్.. అయినా!?

అదృష్టం బాగుంటే ఏం చేసినా అంతా మంచి జరుగుతుందని అంటారు. అదృష్టం మన వెంట ఉన్నప్పుడు మనకు ఎలాంటి అపాయం కలిగినా పెద్దగా ప్రభావం పడదు అని అందరూ నమ్మే సత్యం.

  • Written By:
  • Publish Date - January 6, 2023 / 08:43 PM IST

Heart Attack: అదృష్టం బాగుంటే ఏం చేసినా అంతా మంచి జరుగుతుందని అంటారు. అదృష్టం మన వెంట ఉన్నప్పుడు మనకు ఎలాంటి అపాయం కలిగినా పెద్దగా ప్రభావం పడదు అని అందరూ నమ్మే సత్యం. అచ్చంగా ఇలాంటి ఘటనే ఓ వ్యక్తి జీవితంలో సంభవించింది. విమానంలో, భూమికి 40వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి రెండుసార్లు గుండెపోటు రాగా.. అతడి అదృష్టం బాగుండి.. ఆ విమానంలో ఓ భారతీయ వైద్యుడు ఉండటంతో అతడు ప్రయాణాలతో బయటపడ్డాడు.

యూకే నుండి ఇండియా వస్తున్న ఓ విమానంలో ఓ ప్రయాణికుడికి అకస్మాత్తుగా గుండెపోటు రాగా.. అతడిని కాపాడేందుకు ఫ్లైట్ సిబ్బంది చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ల ప్రయత్నాలు విఫలం కావడంతో విమానంలో ఎవరైనా వైద్య సిబ్బంది ఉన్నారేమో అని సాయం కోసం పిలివగా.. అదే విమానంలో ఉన్న డా.విశ్వరాజ్ వేమల సాయానికి ముందుకు వచ్చాడు. విమాన ప్రయాణంలోనే అతడి ప్రాణాలను కాపాడి, విమానం దిగిన వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

బర్మింగ్ హమ్ ఆస్పత్రిలో హెపటాలజిస్ట్ గా పని చేస్తున్న డాక్టర్ విశ్వరాజ్ వేమల.. యూకే నుండి ఇండియాకు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. దీనిపై డాక్టర్ మాట్లాడుతూ.. ‘నా తల్లిని తీసుకొని యూకే నుండి ఇండియా వస్తుండగా మేం ప్రయాణిస్తున్నవిమానంలో ఓ వ్యక్తి కార్డియా్ అరెస్టుకు గురయ్యాడు. డాక్టర్ కోసం సిబ్బంది పిలవగానే నేను వెళ్లా. అప్పటికే ఆ ప్రయాణికుడి పల్స్ ఆగిపోయింది. శ్వాస కూడా తీసుకోవడం లేదు. దాదాపు గంటసేపు ప్రయత్నించి అతడిని స్పృహలోకి తీసుకురాగలిగా. కానీ అతడు పూర్తిగా కోలుకున్నట్లు కనిపించలేదు’ అని వివరించాడు.

ఆ రోజు జరిగిన ఘటన గురించి మరింత వివరిస్తూ.. ‘క్యాబిన్ సిబ్బంది దగ్గర ఉన్న మెడికల్ కిట్ లో ఆక్సిజన్, ఆటోమెటెడ్ ఎక్స్ టర్నల్ డీపిబ్రిలేటర్ తప్ప మరో వైద్య పరికరం లేదు. దీంతో నేను ప్రయాణికుల వద్ద ఏమైనా ఉన్నాయా అని అడిగా. అదృష్టవశాత్తు వారి నుండి హార్ట్ రేట్ మానిటర్, బీపీ మెషీన్, పల్స్ ఆక్సీమీటర్, గ్లూకోజ్ మీటర్ సాధించి.. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించా. అయితే నాతో మాట్లాడుతుండగానే ఆ వ్యక్తి రెండోసారి కార్డియాక్ అరెస్టుకు గురయ్యాడు. ఈసారి అతడిని స్పృహలోకి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. రెండు గంటల పాటు అతడి బీపీ, పల్స్ పడిపోయాయి. అయినా మేం ప్రయత్నం ఆపలేదు. మొత్తంగా నేను, క్యాబిన్ సిబ్బంది ఐదు గంటల పాటు అతడిని స్పృహలో ఉంచేందుకు శ్రమించాం’ అని తెలిపాడు.