Site icon HashtagU Telugu

USA: భార్య మాట విన్నందుకు…కోటీశ్వరుడు అయ్యాడు..అదృష్టమంటే అతడిదే..!!

Us Dollor

Us Dollor

చాలామంది భార్య మాటలు వినేందుకు ఇష్టపడరు. అప్పుడప్పుడు భార్య మాటలు వినండి. ఎందుకంటే కోటీశ్వరులు కూడా ఛాన్స్ ఉంటుంది. అవును నిజం…ఓ వ్యక్తి తన భార్య చెప్పిన మాటలు విని కోటీశ్వరుడు అయ్యాడు. భార్య సరుకులు తీసుకురమ్మని మెసేజ్ చేసింది. ఆమె చెప్పినట్లుగానే భర్త సరుకులు తీసుకునేందుకు వెళ్లాడు. అక్కడే అతగాడికి లక్ష్మీదేవి వరించింది. రూ. కోట్లు విలువచేసే లాటరీ గెలుచుకున్నాడు. ఇది జరిగింది అమెరికాలో.

అమెరికాలోని మిచిగాన్ వాసి అయిన ప్రెస్టన్ మాకీ …ఆఫీసులు పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా..అతని భార్య కిరాణ సరుకులు తీసుకురమ్మని చెప్పింది. ఆమె చెప్పినట్లుగా షాప్ కు వెళ్లాడు. అక్కడ అతనికి లాటరీ తగిలింది. 190.736 అమెరికన్ డాలర్లు గెలుచుకున్నాడు. దీంతో లైఫ్ సెట్ అయ్యింది.

తన భార్య సరుకులు తీసుకురమ్మని చెప్పకపోతే…తాను అక్కడి వెళ్లేవాడిని కాదని…ఆ లాటరీ తగిలేది కాదని అతను చెప్పాడు. తన భార్య కారణంగానే తాను కోటీశ్వరుడిని అయ్యాయని సంతోషం వ్యక్తం చేశాడు. అందుకే అప్పుడప్పుడు భార్య మాటలు కూడా వింటుండాలి.

Exit mobile version