Ismail Haniyeh Dead: ఇజ్రాయెల్ టెహ్రాన్‌లో హమాస్ అగ్ర రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియా (Ismail Haniyeh Dead)ను హతమార్చింది. ఇస్మాయిల్‌తో పాటు అతని అంగరక్షకుడు కూడా చనిపోయాడు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ను ఉటంకిస్తూ ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇస్మాయిల్ మృతి చెందినట్లు హమాస్ కూడా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. హమాస్ ప్రకటన ప్రకారం.. టెహ్రాన్‌లోని ఇస్మాయిల్ నివాసంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇస్మాయిల్ ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన తర్వాత తిరిగి వచ్చారు. అయితే ఇస్మాయిల్ మృతిపై వ్యాఖ్యానించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది.
దీనిపై స్పందించేందుకు అమెరికా నిరాకరించింది
హమాస్ రాజకీయ విభాగం అధిపతి ఇస్మాయిల్ హనియాపై టెహ్రాన్‌లో దాడి జరిగినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తన ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో పాలస్తీనా హమాస్ గ్రూపునకు చెందిన ఇస్మాయిల్ హనియా, అతని బాడీగార్డు ఒకరు వీరమరణం పొందారు. ఈ విషయంపై అమెరికా స్పందిస్తూ.. టెహ్రాన్‌లో హమాస్ అధినేత ఇస్మాయిల్ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే వెంటనే వ్యాఖ్యానించడానికి వైట్ హౌస్ ప్రతినిధి నిరాకరించారు.
Also Read: ITR Filing Deadline: ఐటీఆర్ గడవు దాటితే జరిమానా ఎంతంటే..?
విదేశీ మీడియా నివేదికలపై స్పందించడానికి ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించిందని CNN రాసింది. ఇస్మాయిల్ మరణం గురించిన సమాచారం మొదట ఇరాన్ మీడియా అందించింది. ఇస్మాయిల్ 1980లలో హమాస్‌లో చేరారు. గత నాలుగు దశాబ్దాలుగా అనేక ముఖ్యమైన అగ్ర నాయకత్వ పదవులను నిర్వహించారు. హత్యకు ఎవరూ బాధ్యులను వెంటనే ప్రకటించలేదు. అయితే అక్టోబరు 7న హమాస్ దాడి తర్వాత ఇస్మాయిల్ హనియా, ఇతర హమాస్ నాయకులను చంపుతామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేయడంతో ఇజ్రాయెల్ పై అనుమానం వచ్చింది. ఇరాన్ అధ్యక్షుడు మస్సౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు హనియా మంగళవారం టెహ్రాన్‌లో ఉన్నారు. హనియా ఎలా హత్యకు గురైంది అనే వివరాలను ఇరాన్ వెల్లడించలేదు.
We’re now on WhatsApp. Click to Join.
ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లోని విశ్లేషకులు వెంటనే దాడికి ఇజ్రాయెల్‌ను నిందించడం ప్రారంభించారు. అయితే హమాస్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి బిడెన్ పరిపాలన ప్రయత్నిస్తున్న సమయంలో ఈ హత్య జరిగింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. అక్టోబర్ దాడుల నుండి 39,360 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. 90,900 మందికి పైగా గాయపడ్డారు.