Yahya Sinwar : హమాస్ కొత్త చీఫ్ యహ్యా సిన్వార్. ఆయన ఆచూకీ ఇప్పుడు కనిపించడం లేదు. దీంతో సిన్వార్‌కు ఏమైనా జరిగిందా ? ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో అంతమయ్యాడా ? అనే కోణంలో అంతర్జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో ఖతర్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యహ్యా సిన్వార్‌తో ముడిపడిన ముఖ్యమైన సమాచారాన్ని వెల్లడించింది. వివరాలివీ..
Also Read :Adventure Bikes : టాప్ – 5 అడ్వెంచర్ బైక్స్.. అదరగొట్టే ఫీచర్స్
హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా.. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడటం లేదట. చివరకు హమాస్‌కు ఎంతో ఫండింగ్‌ను అందించే ఖతర్ దేశ ఉన్నతాధికారులు కాల్ చేసినా సిన్వార్ స్పందించడం లేదట. ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో సిన్వార్ ఫోన్లను వాడటం ఆపేశారని ఖతర్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఎవరితో సంప్రదించాలన్నా కేవలం లేఖలను అతడు వాడుతున్నాడని తెలిపింది. ప్రస్తుత తరుణంలో పేపరు, పెన్నులను మాత్రమే వాడటం సేఫ్ అని సిన్వార్(Yahya Sinwar) భావిస్తున్నారట. లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలోని హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా స్థావరాన్ని ఇజ్రాయెలీ ఆర్మీ బంకర్ బస్టర్ బాంబులతో ధ్వంసం చేసింది.
Also Read :Google Badges : గూగుల్‌లోనూ వెరిఫికేషన్ బ్యాడ్జీలు.. ఫేక్ అకౌంట్స్‌కు చెక్
దీంతో అందులోనే నస్రల్లా హతమయ్యారు. ఒకవేళ తన లొకేషన్ ఇజ్రాయెల్‌కు దొరికితే.. హసన్ నస్రల్లాను చంపినట్టే చంపుతుందని సిన్వార్ భయపడుతున్నారని కథనాలు వస్తున్నాయి. మొత్తం మీద ఖతర్ సర్కారు వర్గాలు చేసిన ప్రకటనతో హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ బతికే ఉన్నాడన్న విషయం స్పష్టమైంది. మరోవైపు లెబనాన్‌లో హిజ్బుల్లా చీఫ్ పదవి ఖాళీగా ఉంది. హసన్ నస్రల్లా స్థానంలో ఆ పదవిని చేపడతారని అందరూ భావించిన హాషిం సఫియుద్దీన్ ఆచూకీ కూడా గల్లంతైంది. ఆయన కూడా ఎవరితోనూ టచ్‌లో లేరు. ఎవరు ఫోన్ కాల్స్ చేసినా సఫియుద్దీన్ స్పందించడం లేదు. దీంతో ఆయన సైతం చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.