Site icon HashtagU Telugu

Saudi Arabia : సౌదీ అరేబియా చేసిన ఈ పనికి…ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఆగ్రహం..!!

Saudi

Saudi

సౌదీ అరేబియాలో ఉండే కఠిన చట్టాల గురించి అందరికీ తెలిసిందే. కొన్నేళ్ల క్రితం సౌదీలో హాలోవీన్ కొత్తేమీ కాదు. కానీ ఈ ఏడాది అక్కడ హాలోవీన్ జరుపుకున్న తీరు వివాదాస్పదమైంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు మండిపడుతున్నారు. సెంటర్ ఆఫ్ ఇస్లాం ఆఫ్ ది వరల్డ్ గా పేరుగాంచిన సౌదీ అరేబియా, హాలోవిన్ సందర్బంగా రంగు రంగుల దుస్తులు ధరించిన కొంతమంది ర్యాంప్ వాక్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో కొత్త వివాదానికి దారి తీసింది. అయితే కొన్నేళ్ల క్రితం సౌదీలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం పెద్ద నేరమేమీ కాదు. కానీ మహమ్మద్ బిన్ సల్మాన్ క్రౌన్ ప్రిన్స్ అయినప్పటి నుంచి సౌదీలో ఇస్లామిక్ ఆచారాల్లో ఎంతో మార్పులు వచ్చాయి. అందులో ఒకటి ఈ హాలోవీన్.

సౌదీ అరేబియా ప్రభుత్వం హాలోవీన్ ను ఘనంగా జరుపుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ సౌదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు పెద్దగా అంగీకరంచడం లేదు. సోషల్ మీడియాలో ప్రజల మధ్య హాలోవీన్ జరపుకోవడం హరామ్, హలాల్ సమస్యగా మారడానికి ఇది కారణమంటూ మండిపడుతున్నారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు దీన్ని హరామ్ గా కామెంట్ చేశారు. ఇస్లాంలో హరామ్ అంటే తప్పు చేయడం అని అర్థం. అంతేకాదు ఈ హాలోవిన్ ను చాలా మంది స్వాగతించారు కూడా. సౌదీ అరేబియా ట్రెండ్ ను మాత్రమే అనుసరిస్తోందని కొందరు కామెంట్ చేశారు. కొంతమంది దీనిని మహ్మద్ బిన్ సల్మాన్ హయాంలో సౌదీలో పెను మార్పులకు సంకేతంగా పేర్కొన్నారు.

https://twitter.com/SultanShoaib19/status/1586860008511508480?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1586860008511508480%7Ctwgr%5E7b74bf518f66e90e48a33ba8dc16b16a3e148876%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fworld%2Fstory%2Fhalloween-party-2022-celebrated-in-saudi-arabia-first-time-in-islamic-country-tlifws-1565363-2022-10-31

ట్విట్టర్‌లో ఒక నెటిజన్ ‘ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలో ముస్లిం ప్రజలు హాలోవీన్ జరుపుకోవడం నేను చూశాను. ముస్లిం అయినందున హాలోవీన్ జరుపుకోవడ.పై నిషేధం ఉంది. అల్లా మనందరినీ క్షమించుగాక. అంటూ ట్వీట్ చేశాడు.