అమెరికా ప్రభుత్వం (US Govt) తాజాగా H-1B వీసా ఫీజును భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఈ పెంపు భారత ఐటీ రంగం సహా అనేక దేశాల టెక్నికల్ ప్రొఫెషనల్స్‌కు భారంగా మారబోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, తాజాగా కొన్ని మినహాయింపులు ప్రకటించడం వల్ల కొంత ఊరట లభించింది. ప్రస్తుతం H-1B వీసా కలిగిన వారు, అమెరికాలో కొనసాగుతున్నవారికి ఈ కొత్త ఫీజు భారం పడదు. అంటే, వీసా రీన్యువల్ లేదా కొత్త ఫీజు చెల్లింపు అవసరం ఉండదని స్పష్టం చేశారు. ఇది అమెరికాలో ఇప్పటికే పనిచేస్తున్న వలస ఉద్యోగులకు ఉపశమనం కలిగించే నిర్ణయంగా చెప్పుకోవచ్చు.
Kadiyam Srihari: ఎన్నికల్లో పోటీ చేయను.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!
అయితే మరోవైపు గత 12 నెలలుగా లేదా అంతకంటే ఎక్కువ కాలంగా అమెరికా వెలుపల ఇతర దేశాల్లో ఉంటున్న H-1B వీసా హోల్డర్లకు కొత్త షరతులు విధించారు. వీరు రేపటిలోగా (గడువు ముగిసేలోగా) తిరిగి అమెరికాకు చేరుకోవాలి. లేకపోతే తిరిగి వెళ్లేందుకు పెంచిన ఫీజు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది వందలాది మంది ఇండియన్లకు కీలకమైన షరతుగా మారింది. గడువు దాటితే కొత్తగా పెరిగిన ఫీజును భరించాల్సిన అవసరం రావడం వల్ల, ప్రస్తుతం దేశానికి బయట ఉన్నవారిలో ఆందోళన నెలకొంది. సమయానికి వెళ్లకపోతే కొత్త నియమాలు వర్తిస్తాయి.
H-1B Visa Fee Hike: హెచ్-1బి వీసా ఫీజు పెంపు.. భారతదేశానికి ప్రయోజనమా??
అదనంగా అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అనుమతించిన కొందరికి ప్రత్యేక మినహాయింపులు కూడా ఉంటాయని ప్రకటించారు. ముఖ్యంగా హెల్త్కేర్, మిలిటరీ, ఇంజినీరింగ్ వంటి కీలక రంగాల్లో పనిచేసే నిపుణులకు ఈ మినహాయింపులు వర్తిస్తాయి. అమెరికాలో అత్యవసరంగా అవసరమైన రంగాలకు అర్హులైన వీసా హోల్డర్లను ఆకర్షించేందుకు, వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా అమెరికా కీలక రంగాల్లో నైపుణ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, వలస విధానంలో సమతుల్యతను చూపించేందుకు ప్రయత్నిస్తోంది.
