సౌదీ అరేబియా ని ముస్లింల అత్యంత పవిత్ర నగరంగా చెబుతూ ఉంటారు. అక్కడ ఉండే ముస్లింలు అక్కడి ఆచారాలను, అలాగే కట్టుబాట్లను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అక్కడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారికి అందుకు తగిన విధంగానే కఠిన శిక్షలను కూడా అమలు చేస్తూ ఉంటారు. అందుకే చాలామంది సౌదీ అరేబియా అంటే ఇష్టపడుతూ ఉండగా మరి కొంతమంది భయపడుతూ ఉంటారు. అయితే అటువంటి సౌదీ అరేబియా నగరం మదీనాలో భారీగా బంగారం అలాగే రాగి నిక్షేపాలు గుర్తించినట్టు ఆ దేశం తాజాగా ప్రకటించింది.
కొత్తగా బంగారు అలాగే రాగి గనులను కనుగొన్నట్టు సౌదీ జియోలాజికల్ సర్వే తాజాగా తన ట్విట్ లో పేర్కొంది. మదీనా ప్రాంతంలో ఉన్న అబా అల్ రహా వద్ద భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్టు తన ట్వీట్ లో వెల్లడించింది.వాది అల్ ఫారా ప్రాంతంలో దాదాపుగా నాలుగు చోట్ల రాగి గనులు ఉన్నట్లు కూడా తెలిపింది.
అయితే కొత్త మైనింగ్ ప్రాంతాల వల్ల దాదాపుగా 533 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించవచ్చు అని సౌదీ జియోలాజికల్ సర్వే తన నివేదికలో వెల్లడించింది. అంతేకాకుండా దానిద్వారా 4000 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి అని పేర్కొన్నారు. అలాగే సౌదీలో 5300 కీ పైగా ఖనిజ సంపద ప్రదేశాలు ఉన్నాయని సౌదీ జియోలిజస్ట్స్ కో ఆపరేటివ్ అసోసియేషన్ చైర్మన్ అబ్దుల్ జీజ్ బిన్ లబన్ ఇటీవల వెల్లడించారు.