Google Searches: 2025 సంవత్సరంలో ఓవరాల్‌గా అత్యధికంగా సెర్చ్ చేయబడిన పేరు మ్యుజీషియన్ (డేవిడ్ ఆంథోనీ బర్క్). అయితే డేవిడ్ ఆంథోనీ బర్క్ సెర్చ్ పెరగడానికి అతని సంగీతం కంటే అతనిపై జరిగిన ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రధాన కారణం. కానీ వ్యాపార ప్రపంచంలోని దిగ్గజాల గురించి తెలుసుకోవడంలో కూడా ప్రజలు అంతే ఆసక్తి చూపారు. గూగుల్ ‘ఇయర్ ఇన్ సెర్చ్’ జాబితా సాధారణంగా మొత్తం సెర్చ్ వాల్యూమ్ కంటే గత ఏడాదితో పోలిస్తే సెర్చ్ ఇంట్రెస్ట్‌లో అతిపెద్ద ‘స్పైక్’ కనిపించిన వ్యక్తులను హైలైట్ చేస్తుంది.
2025లో ట్రెండింగ్‌లో ఉన్న వ్యాపారవేత్తలు
ఎలన్ మస్క్
టెస్లా, స్పేస్ ఎక్స్ CEO, X (ట్విట్టర్) యజమాని ఎలన్ మస్క్ 2025లో హాట్ టాపిక్‌గా నిలిచారు. డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇవ్వడం నుండి అమెరికా ప్రభుత్వంలోని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ’ కి నాయకత్వం వహించడం వరకు ఆయన వార్తల్లో నిలిచారు. అమెరికా అధ్యక్షుడితో ఆయన సంబంధాలు చెడిపోవడం, xAI చాట్‌బాట్ ‘గ్రోక్’, ప్రపంచంలోనే మొదటి ‘ట్రిలియనీర్’ కాబోతున్నారనే వార్తలు ఆయన్ని సెర్చ్‌ల్లో అగ్రస్థానంలో నిలిపాయి.
Also Read: ఆస్ట్రేలియాలో కాల్పుల ఘటన.. అనుమానితుడు హైదరాబాద్ వాసి!
లిండా యాకరినో
ఎక్స్ CEO పదవికి రాజీనామా చేసిన లిండా యాకరినో 2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన వ్యక్తులలో ఒకరు. మార్చి 2025లో ఎలన్ మస్క్ AI కంపెనీ xAI, ‘X’ ప్లాట్‌ఫారమ్‌ను కొనుగోలు చేసిన సమయంలో ఆమె తప్పుకోవడం పెద్ద వివాదంగా మారింది. ఈ కార్పొరేట్ డ్రామా మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది.
జెన్సన్ హువాంగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఎన్విడియా (NVIDIA) సాధించిన తిరుగులేని నాయకత్వం కారణంగా జెన్సన్ హువాంగ్ గురించి తెలుసుకోవడానికి ప్రజలు చాలా ఆసక్తి చూపారు.
సామ్ ఆల్ట్‌మాన్
AI విప్లవంలో కీలక వ్యక్తిగా ChatGPT సృష్టికర్తగా సామ్ ఆల్ట్‌మాన్ నిరంతరం చర్చల్లో నిలిచారు.
మార్క్ జుకర్‌బర్గ్
మెటావర్స్ రంగంలో ఆయన చేస్తున్న ప్రయోగాలు, మెటా కంపెనీ వృద్ధి కారణంగా జుకర్‌బర్గ్ సెర్చ్‌ల్లో కొనసాగారు.
జెఫ్ బెజోస్
ఈ-కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, స్పేస్ టూరిజంతో పాటు, ఆయన వ్యక్తిగత జీవితం (వివాహం) కూడా సెర్చ్‌లు పెరగడానికి కారణమైంది.
బెర్నార్డ్ ఆర్నాల్ట్
లగ్జరీ వస్తువుల రంగంలో రారాజుగా, ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానాల కోసం ఆయన పడుతున్న పోటీ ప్రజల్లో ఉత్సుకతను పెంచింది.
లారీ పేజ్- సెర్గీ బ్రిన్
ఆల్ఫాబెట్ టెక్ ప్రయోగాల్లో వీరిద్దరి ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతో వీరు కూడా సెర్చ్ లిస్ట్‌లో నిలిచారు.
