Site icon HashtagU Telugu

Google CEO: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు పద్మభూషణ్‌ ప్రధానం

Story 54 11zon

Story 54 11zon

గూగుల్, ఆల్ఫాబెట్ కంపెనీల సీఈఓ సుందర్ పిచాయ్ కు అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు పద్మభూషణ్‌ను ప్రధానం చేశారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సుందర్ పిచాయ్‌కి పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందజేయనున్నట్లు హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పద్మభూషణ్‌ ఇచ్చినందుకు రాయబారి సంధు, కాన్సుల్ జనరల్ ప్రసాద్‌లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అపారమైన గౌరవానికి భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్ను తీర్చిదిద్దిన దేశం ఇలా గౌరవించడం అర్థవంతంగా ఉందని సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు.

గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌ను అమెరికాలోని భారత రాయబారి ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. అవార్డు అందుకున్న సందర్భంగా పిచాయ్ మాట్లాడుతూ.. ‘భారతదేశం నాలో ఒక భాగమని, నేను ఎక్కడికి వెళ్లినా దానిని తన వెంట తీసుకెళ్తాను’ అని అన్నారు. Google CEO వాణిజ్యం, పరిశ్రమల విభాగంలో 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. పద్మభూషణ్ దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారం. మధురైలో జన్మించిన పిచాయ్ శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కోలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ అవార్డును అందుకున్నారు.

పిచాయ్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన కుటుంబంలో పెరగడం తన అదృష్టమని అన్నారు. నా తల్లిదండ్రులు తమ అభిరుచులను అన్వేషించే అవకాశాలను పొందేలా చేయడానికి చాలా త్యాగాలు చేశారని తెలిపాడు. సుందర్ పిచాయ్ సాంకేతికతపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని కూడా గుర్తుచేసుకున్నారు. ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా విజన్ ఖచ్చితంగా పురోగతికి వేగవంతం చేస్తుంది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వాలు, వ్యాపారాలు, కమ్యూనిటీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను అన్నారు.

 

 

 

 

 

 

Exit mobile version