Site icon HashtagU Telugu

UPI for NRI: ఆ పది దేశాల ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్.. ఇకపై వారు కూడా యూపీఐ పేమెంట్స్ చెయ్యొచ్చు!

Whatsapp Image 2023 01 12 At 20.41.25

Whatsapp Image 2023 01 12 At 20.41.25

UPI for NRI: యూపీఐ ఇప్పుడు మరో 10 దేశాలకు వ్యాపించనుంది. ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యులర్ ప్రకారంగా యూపీఐ సేవలు త్వరలో అంతర్జాతీయంగా కూడా వ్యాపించనున్నాయి. యూపీఐ సంబంధిత దేశీయ కోడ్‌లతో పాటుగా 10 దేశాల మొబైల్ నంబర్ల నుంచి లావాదేవీలను ప్రారంభిస్తున్నట్లు సమాచారం. సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, యూఎస్ఏ, సౌదీ అరేబియా, యూఏఈ, యూకే దేశాల నుంచి త్వరలో యూపీఐ లావాదేవీలు చేసే అవకాశం ఉండనుంది.

అంతర్జాతీయ మొబైల్ నంబర్లను కలిగి ఉన్న నాన్-రెసిడెంట్ ఖాతాలు యూపీఐలో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనలు, యాంటీ మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయకపోవడం వంటి నిబంధనలకు లోబడి లావాదేవీలు జరిపేందుకు అనుమతులు లభించనున్నాయి. సింగపూర్ నుంచి నంబర్లతో లావాదేవీలు త్వరలో ప్రారంభించడానికి యూపీఐ, సింగపూర్ పేనౌ భాగస్వామ్యం కానున్నాయి.

2023 ఏప్రిల్ 30వ తేదీలోపు ఎన్‌పీసీఐ సభ్యులందరూ ఈ ఆదేశాలను పాటించాలని ఒక సర్క్యూలర్ రిలీజ్ అయ్యింది. స్మార్ట్ ఫోన్ల ద్వారా డబ్బును బదిలీ చేయడానికి యూపీఐ అత్యంత అనుకూలమైన మార్గాలలో ఒకటని చెప్పొచ్చు. 2022లో యూపీఐ నెట్‌వర్క్ లావాదేవీలు 90 శాతం పెరిగాయని, ఇక నగదు విషయంతో పోలిస్తే గత సంవత్సరంతో పోలిస్తే లావాదేవీల విలువలో 76 శాతం పెరిగిందని, యూపీఐ ద్వారా చెల్లింపు లావాదేవీలు నెలవారీగా 7.7 శాతం పెరిగి డిసెంబర్‌లో గరిష్టంగా రూ.12.8 లక్షల కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. ఇటువంటి తరుణంలో మరో 10 దేశాలకు యూపిఐ సేవలు వ్యాపించనున్నాయి