Site icon HashtagU Telugu

Golden Passport: గోల్డెన్ పాస్‌పోర్ట్ అంటే ఏమిటి? దాని ఉప‌యోగాలు ఏంటి?!

Golden Passport

Golden Passport

Golden Passport: గోల్డెన్ పాస్‌పోర్ట్ (Golden Passport) అనేది పెట్టుబడికి బదులుగా పౌరసత్వం ఇచ్చే ఒక కార్యక్రమం (ప్రోగ్రామ్). ఈ కార్యక్రమం కింద ఆ దేశంలో నివాసం ఉండకుండా కేవలం పెట్టుబడి పెట్టడం ద్వారా పౌరసత్వం ఇవ్వబడుతుంది. పౌరుడిగా పాస్‌పోర్ట్ జారీ చేయబడుతుంది. దీనినే గోల్డెన్ పాస్‌పోర్ట్ అంటారు. ఈ పాస్‌పోర్ట్‌ను పొందిన వ్యక్తికి అనేక హక్కులు, ప్రయోజనాలు లభిస్తాయి. వారు విదేశీయులు అయినప్పటికీ స్థానిక పౌరులు పొందే ప్రయోజనాలను అనుభవించవచ్చు. ఈ పాస్‌పోర్ట్ పరిధిలోకి కుటుంబం మొత్తం వస్తుంది. అంటే ఒకే పాస్‌పోర్ట్‌పై కుటుంబమంతా ప్రయాణించవచ్చు.

పాస్‌పోర్ట్ ఎలా పొందవచ్చు?

గోల్డెన్ పాస్‌పోర్ట్ తీసుకుంటే మీ మూల దేశం పౌరసత్వం (ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించే దేశాల్లో) అలాగే ఉంటుంది. అయితే గోల్డెన్ పాస్‌పోర్ట్‌ను పొందడం అంత సులభం కాదు. ఎందుకంటే దీని కోసం మీరు సంబంధిత దేశంలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది.

పెట్టుబడి పెట్టే మార్గాలు

Also Read: iBomma : ఐబొమ్మ రవికి ఆ అలవాట్లు..క్రిమినల్ బ్రెయిన్.? తండ్రి షాకింగ్ కామెంట్స్.!

తక్కువ పెట్టుబడితో పౌరసత్వం

డొమినికా: కేవలం రూ. 1.7 కోట్ల కనీస పెట్టుబడితో ఈ దేశం గోల్డెన్ పాస్‌పోర్ట్‌ను అందిస్తోంది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా 140 కంటే ఎక్కువ ప్రాంతాలకు వీసా-రహితంగా లేదా అరైవల్ ఆన్ వీసా సేవలను పొందవచ్చు.

గ్రెనడా & నార్త్ మెసిడోనియా: ఈ రెండు దేశాల్లో దాదాపు రూ. 2 కోట్ల పెట్టుబడితో పౌరసత్వం లభిస్తుంది. గ్రెనడా పాస్‌పోర్ట్‌తో 140 కంటే ఎక్కువ ప్రాంతాలకు, నార్త్ మెసిడోనియా పాస్‌పోర్ట్‌తో 120 కంటే ఎక్కువ ప్రాంతాలకు ప్రయాణించవచ్చు. అయితే నార్త్ మెసిడోనియాలో కనీసం 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలనే నిబంధన ఉంది.

సెయింట్ లూసియా: ఇక్కడ రూ. 2.1 కోట్ల పెట్టుబడితో గోల్డెన్ పాస్‌పోర్ట్ అందిస్తారు. దీనితో 140కి పైగా ప్రాంతాలకు వీసా-రహిత ప్రయాణం చేయవచ్చు.

సెయింట్ కిట్స్, నెవిస్: ఈ దేశంలో కనీసం రూ. 2.2 కోట్ల పెట్టుబడితో 157 ప్రాంతాలకు వీసా రహిత సదుపాయం లభిస్తుంది.

తుర్కియే (టర్కీ): సుమారు రూ. 3.5 కోట్ల పెట్టుబడితో ఇక్కడ గోల్డెన్ పాస్‌పోర్ట్ పొందవచ్చు. దీని ద్వారా 110 కంటే ఎక్కువ గమ్యస్థానాలకు ప్రయాణించవచ్చు.

భారీ పెట్టుబడి అవసరమయ్యే దేశాలు

జోర్డాన్: గోల్డెన్ పాస్‌పోర్ట్ కోసం జోర్డాన్ సుమారు రూ. 12.5 కోట్ల భారీ పెట్టుబడిని కోరుతోంది. అయినప్పటికీ దీనితో 50 కంటే ఎక్కువ ప్రాంతాలకు మాత్రమే వీసా రహిత ప్రయాణాలు సాధ్యమవుతాయి.

ఆస్ట్రియా: ఈ దేశం పెట్టుబడికి నిర్దిష్ట మొత్తాన్ని నిర్ణయించనప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందించాలని కోరుతోంది. ఈ పాస్‌పోర్ట్‌తో అత్యధికంగా 190 కంటే ఎక్కువ ప్రాంతాలకు వీసా రహిత ప్రయాణ సదుపాయం లభిస్తుంది.

సేవ నిలిపివేసిన దేశం

గతంలో గోల్డెన్ పాస్‌పోర్ట్ సేవలను అందించిన సైప్రస్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది. కాగా, భారత పౌరులు గోల్డెన్ పాస్‌పోర్ట్ పొందాలంటే ద్వంద్వ పౌరసత్వాన్ని భారత్ అంగీకరించదు. కాబట్టి తమ భారతీయ పాస్‌పోర్ట్‌ను వదులుకోవలసి ఉంటుంది.

Exit mobile version