నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు (Protests) ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. అవినీతి ప్రభుత్వంపై పోరాటం కోసం ఏకమైన Gen-Z యువత ఇప్పుడు గ్రూపులుగా విడిపోయింది. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌లో చర్చలు జరుగుతున్న సమయంలో ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వేరొక వర్గంతో ఆర్మీ చర్చలు జరుపుతోందని ఒక వర్గం ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది.
YS Sharmila : జగన్ కు అసలు ఐడియాలజీ ఉందా? – షర్మిల ఘాటు వ్యాఖ్యలు
ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాను కృషి చేస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడటానికి మార్గాలను అన్వేషిస్తున్నానని ఆయన తెలిపారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ప్రజలు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అన్ని సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. యువతలో గ్రూపు తగాదాలు చోటుచేసుకోవడం ఈ ఉద్యమానికి ఒక పెద్ద ఎదురుదెబ్బగా మారింది. గతంలో అవినీతి వ్యతిరేక పోరాటాలు కూడా ఇలాగే వర్గ విబేధాల కారణంగా బలహీనపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో యువత ఐక్యంగా ఉండి తమ డిమాండ్లను సాధించుకోవడం అవసరం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.