Site icon HashtagU Telugu

3 Step Plan : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ముగించడానికి 3 దశల ప్లాన్

3 Step Plan

3 Step Plan

3 Step Plan : అక్టోబరు 7 నుంచి యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ – గాజా మధ్య మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి. జనవరి 1లోగా ఈ డీల్ కుదిరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి ఇజ్రాయెల్ – గాజా మధ్య ఈజిప్టు దేశం మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఈజిప్టు రాజధాని కైరోలో హమాస్ ప్రతినిధులు, ఇజ్రాయెల్ ప్రతినిధులు భేటీ అయి కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించారు. ఈ చర్చల తర్వాతే ఈజిప్టు దేశం 3 దశల ప్రణాళికను(3 Step Plan) తయారు చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

  1. ఈజిప్టు రెడీ చేసిన  మొదటి దశ ప్రణాళిక ప్రకారం.. ఇజ్రాయెల్ , హమాస్‌లు రెండు వారాల పాటు యుద్ధాన్ని ఆపేయాల్సి ఉంటుంది. ఈ టైంలో 40 మంది ఇజ్రాయెలీ బందీలను హమాస్ రిలీజ్ చేస్తుంది. వీరిలో మహిళలు, మైనర్లు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉంటారు. మరోవైపు ఇజ్రాయెల్ పాలస్తీనాకు చెందిన 120 మంది ఖైదీలను రిలీజ్ చేస్తుంది. ఈ రెండు వారాల టైంలో గాజా నుంచి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులను వెనక్కి తెచ్చుకోవాలి. వైమానిక దాడులు ఆపేయాలి. మానవతా సహాయం గాజాలోకి పంపాలి.
  2. ఈజిప్టు రెడీ చేసిన రెండో దశ ప్రణాళిక ప్రకారం.. పాలస్తీనాలోని ఫతా పార్టీ, పాలస్తీనా అథారిటీ, హమాస్ మధ్య వైరుధ్యాలను ఈజిప్టు తొలగిస్తుంది. వాటిని ఏకం చేసి వెస్ట్ బ్యాంక్, గాజాలో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడేలా చూస్తుంది. గాజా పునర్నిర్మాణాన్ని ఈజిప్టు పర్యవేక్షిస్తుంది. పాలస్తీనా పార్లమెంటరీ ఎన్నికలు, అధ్యక్ష ఎన్నికలకు మార్గం సుగమం చేస్తుంది.
  3. ఈజిప్టు రెడీ చేసిన మూడో దశ ప్రణాళిక ప్రకారం.. సమగ్ర కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది. అక్టోబరు 7 తర్వాత అరెస్టయి ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్‌లకు చెందిన నేతలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి.  ఈ దశలో ఇజ్రాయెల్ తన బలగాలను గాజాలోని నగరాల నుంచి ఉపసంహరించుకుంటుంది. ఉత్తర గాజా నుంచి వలసపోయిన ప్రజలు తిరిగి వారి ఇళ్లకు చేరుకోవడానికి ఇజ్రాయెల్ అనుమతిస్తుంది.

Also Read: CM Revanth : సీఎం రేవంత్‌కు స్వల్ప జ్వరం.. కరోనా టెస్టు చేసిన డాక్టర్లు

ఈజిప్టు రెడీ చేసిన ఈ ప్రణాళికతో ఇజ్రాయెల్ ఏకీభవించే అవకాశాలు తక్కువేనని పరిశీలకులు అంటున్నారు. మరిన్ని రోజుల పాటు యుద్ధాన్ని కొనసాగించేందుకే ఇజ్రాయెల్ మొగ్గుచూపినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం గాజాలో ఇజ్రాయెల్ సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. ఈ ఒక్క కారణంతో ఈజిప్టు తయారు చేసిన డీల్‌కు నెతన్యాహూ ఓకే చెప్పే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని విశ్లేషిస్తున్నారు. మరోవైపు బైడెన్ కూడా నెతన్యాహు యుద్ధోన్మాదంపై ఆగ్రహంతో ఉన్నారు. ఓ వైపు గాజాపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్‌కు ఆయుధాలు ఇస్తున్న అమెరికా.. మరోవైపు నెతన్యాహు ప్రభుత్వం వైఖరిని విమర్శిస్తుండటం గమనార్హం.