గాజా (Gaza ) ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో (Israeli airstrikes) మరణాల సంఖ్య పెరుగుతోంది. గడచిన కొన్ని గంటలుగా కొనసాగుతున్న బాంబు దాడుల్లో ఇప్పటివరకు 342 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. దాడుల కారణంగా వేలాది మంది గాయపడగా, ఆసుపత్రులు అధిక సంఖ్యలో బాధితులను రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
Zodiac Signs: మార్చి 19న ఈ 5 రాశుల వారి జాతకం మారిపోనుందా.. ఇందులో మీ రాశి ఉందో లేదో చూడండి!
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ కట్జ్.. తమ దేశానికి చెందిన 59 మంది బందీలను విడుదల చేయకపోతే గాజాపై దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. హమాస్ గ్రూపు ఇప్పటికీ పలువురు ఇజ్రాయెలీ బందీలను కట్టడి చేసుకుని ఉంచినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌పై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
యుద్ధం కారణంగా గాజా ప్రజలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మంచినీరు, ఆహారం, ఔషధాలు లభించక జనాలు ఆవేదనలో మునిగిపోయారు. అంతర్జాతీయ సమాజం ఈ ఘర్షణను నివారించేందుకు కృషి చేయాలని, పాలస్తీనీయుల హక్కులను పరిరక్షించేందుకు ప్రపంచదేశాలు ముందుకు రావాలని మానవహక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.