Israeli Attack : ఓ వైపు లెబనాన్.. మరోవైపు గాజా.. ఇంకో వైపు సిరియా.. మరొక వైపు యెమన్.. ఇలా ప్రతీచోట ఇజ్రాయెల్ ఆర్మీ దాడులతో విరుచుకుపడుతోంది. నలుమూలలా ఉన్న తన శత్రువులను ఇజ్రాయెల్ వెంటాడి మరీ అంతం చేస్తోంది. ఆయా చోట ఉన్న ఉగ్రవాద స్థావరాలను ఇజ్రాయెలీ ఆర్మీ బూడిదకుప్పలుగా మారుస్తోంది. తాజాగా పాలస్తీనాలోని సెంట్రల్ గాజా ప్రాంతం దైర్ అల్ బలా వీధిలోని అల్ అక్సా మార్టైర్స్ ఆస్పత్రి వద్ద ఉండే మసీదుపై ఇజ్రాయెలీ ఆర్మీ యుద్ధ విమానాల నుంచి బాంబులు జార విడిచింది.
A self immolation attempt at the Washington DC anti Israel protest.
متظاهر يحاول إحراق نفسه في العاصمة واشنطن في مظاهرة ضد العدوان الاسرائيلي pic.twitter.com/zlrs1Booyt— Tarek Abou Ghazala (@tarekmd) October 5, 2024
Also Read :Stuck At 6000 Metres : 3 రోజులు 6000 మీటర్ల ఎత్తులో.. మహిళా పర్వతారోహకులకు ఏమైందంటే ?
ఈ ఘటనలో ఆ మసీదులో తలదాచుకున్న సామాన్య ప్రజల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మసీదు ప్రాంగణమంతా రక్తసిక్తమైంది. బాధిత కుటుంబాల ఆర్తనాదాలు మసీదులో మిన్నంటాయి. అయితే తాము సామాన్య ప్రజలను టార్గెట్ చేయలేదని.. మసీదులో దాక్కున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని ఇజ్రాయెలీ ఆర్మీ ప్రకటించింది. ఆ మసీదులోనే హమాస్ ఉగ్రవాదుల కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉందని ఆరోపించింది. గతంలోనూ పాలస్తీనాలోని మసీదులు, స్కూళ్లు, యూనివర్సిటీలు లక్ష్యంగా దాడులు చేసినప్పుడు ఇజ్రాయెల్ ఇదే విధమైన వివరణను విడుదల చేసింది.
Also Read :French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
ఇజ్రాయెల్ పాశవిక దాడులను నిరసిస్తూ అమెరికాలో నిరసనలు(Israeli Attack) కొనసాగుతున్నాయి. తాజాగా అమెరికాలోని వైట్ హౌస్ ఎదుట ఓ నిరసనకారుడు తనకు తాను నిప్పంటించుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి తనకు తాను నిప్పు పెట్టుకున్నాడు. అనంతరం ఎడమ చేయి కాలిపోతుండటంతో సదరు యువకుడు అరుపులు పెడుతూ ఏడ్వడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు ఆర్పారు. నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. వెంటనే నిరసనకారుడిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.