Gaston Glock: గన్ ని తయారు చేసిన గాస్టన్ గ్లాక్ మృతి(94)

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్నతుపాకుల సృష్టికర్త గాస్టన్ గ్లాక్( 94) కన్నుమూశారు. ఒకసారి లోడ్ చేస్తే 18 రౌండ్లు కాల్చగలిగే గ్లాక్ పిస్టల్ ను రూపొందించిన గాస్టన్ గ్లాక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందారు. ఆయన మొత్తం ఆస్థి విలువ 1.1 బిలియన్లని ఫోర్బ్స్ అంచనా వేసింది.

Gaston Glock: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్నతుపాకుల సృష్టికర్త గాస్టన్ గ్లాక్( 94) కన్నుమూశారు. ఒకసారి లోడ్ చేస్తే 18 రౌండ్లు కాల్చగలిగే గ్లాక్ పిస్టల్ ను రూపొందించిన గాస్టన్ గ్లాక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందారు. ఆయన మొత్తం ఆస్థి విలువ 1.1 బిలియన్లని ఫోర్బ్స్ అంచనా వేసింది.

గాస్టన్ గ్లాక్ ఆస్ట్రియా రాజధాని వియన్నాలో 1929లో జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఆయన ‘గ్లాక్ 17’ అనే తుపాకీని తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా పేమస్ అయ్యాడు. ఈ తుపాకీ మార్కెట్లోకి రావడమే ఆలస్యం గణనీయంగా అమ్ముడుపోయేది. అనతికాలంలోనే ఈ ఆయుధం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. అంతెందుకు 2003లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ‘గ్లాక్’ ఆయుధంతో భూగర్భంలో ఓ చిన్న ప్రాంతంలో దాక్కున్నట్లు అమెరికా సైనికులు గుర్తించారు. ఆ తర్వాత ఈ ఆయుధాన్ని అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ.. బుష్‌కు ఇచ్చారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

Gaston Glock

1994లో గాస్టన్ గ్లాక్ 70 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతను దాడికి గురయ్యాడు. అయితే.. దాన్నుంచి బయటపడ్డాడు. దాడి చేసిన వ్యక్తి మరెవరో కాదు అతని వద్ద పనిచేసే బ్రోకర్ చార్లెస్ ఎవర్ట్. అతను గాస్టన్ గ్లాక్ లావాదేవీలను నిర్వహిస్తాడు. ఎవర్ట్‌పై అనుమానంతో అతన్ని కోర్టుకు లాగాడు. ఆ కోపంతో, గస్టన్ గ్లాక్‌ని చంపడానికి జాక్స్ పీచర్ అనే మాజీ రెజ్లర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. మాజీ రెజ్లర్ గాస్టన్ గ్లాక్‌ని చంపడానికి ప్రయత్నించాడు. కానీ… అదృష్టవశాత్తూ, గాస్టన్ గ్లాక్ ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఈ కేసులో వారిద్దరూ జైలు పాలయ్యారు.

గుస్టన్ గ్లాక్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, అతను 49 సంవత్సరాల సుదీర్ఘ వివాహం తర్వాత 2011లో హెల్గా గ్లాక్‌కు విడాకులు ఇచ్చాడు. ఈ జంట భరణం విషయంలో సుదీర్ఘ న్యాయ పోరాటం చేసింది. అయితే.. విడాకులు తీసుకున్న వెంటనే గాస్టన్ గ్లాక్ తనకంటే 50 ఏళ్లు చిన్నదైన యువతిని పెళ్లాడాడు.ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Also Read: Nani: నాని కొత్త సినిమా ‘సరిపోదా శనివారం’ లేటెస్ట్ అప్డేట్