Site icon HashtagU Telugu

Gambia U Turn : గాంబియా సర్కార్ యూ టర్న్…చిన్నారుల మరణానికి భారత దగ్గు సిరప్ కారణం కాదు..?

Cough Syrups

Cough Syrup

భారత్ లో తయారు చేసిన దగ్గు సిరప్ వల్లే గాంబియాలో 66మంది పిల్లలు మరిణించారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భారత్ ను దోషిగా చేసింది గాంబియా. అయితే ఇప్పుడు ఈ విషయంలో గాంబియా సర్కార్ యూ టర్న్ తీసుకుంది. భారత దగ్గు సిరప్ వల్ల చిన్నారులు మరణించినట్లు ఇంకా ధృవీకరించలేదని ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ ఔషధాల నియంత్రణ ఏజెన్సీ ప్రతినిధి తెలిపారు.

గత నెలలో విడుదల చేసిన అసోసియేటేడ్ ప్రెస్ రిపోర్టు ప్రకారం..గాంబియాలోని హెల్త్ డైరెక్టర్ ముస్తాఫా బిట్టాయే చిన్నారుల మరణానికి కారణం గుర్తించారు. చిన్నారులందరూ కిడ్నీ సమస్యల కారణంగా మరణించినట్లు వెల్లడించారు. అలాంటి సిరప్ లను దేశంలోకి అనుమతించినందుకు గాంబియా స్క్రీనింగ్, ఆడిట్ నిబంధనలను భారత్ ప్రశ్నించిదని పేర్కొంది. మరణించిన 66మంది చిన్నారులకు ఈ కోలి , డయేరియా ఉన్నట్లు రిపోర్టులో ఉందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. అలాంటప్పుడు ఆ చిన్నారులకు దగ్గు సిరప్ ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించింది.

గాంబియాలోని చిన్నారుల మరణాన్ని సీరియస్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దర్యాప్తును కమిటీని ఏర్పాటు చేసింది. వైద్యంపై జాతీయ స్టాండింగ్ కమిటీ వైస్ ఛైర్మన్ డాక్టర్ వైకె గుప్తా అధ్యక్షతన ఈ కమిటిని ఏర్పాటు చేసింది. విచారణ రిపోర్టు వచ్చేంత వరకు కంపెనీ ఉత్పత్తిని నిలిపివేసింది. దీంతో అక్టోబర్ 1,3,6 ,11 తేదీలలో ఈ సిరప్ ను ఉత్పత్తి చేసే కంపెనీని పరిశీలించారు. అక్కడి నుంచి నమూనాలను సేకరించి చండీగడ్ లోని ల్యాబ్ కు పంపించారు. అయితే రిపోర్టు ఫలితాలకు ముందే గాంబియా సర్కార్ యూ టర్న్ తీసుకుంది. చిన్నారుల మరణానికి కారణం దగ్గు సిరప్ కాదని వెల్లడించింది.