Abortion Right : అబార్షన్‌ ఇక మహిళల రాజ్యాంగ హక్కు

Abortion Right : అబార్షన్ (గర్భస్రావం) చేయించుకోవడాన్ని మహిళల రాజ్యాంగపరమైన హక్కుగా గుర్తించిన తొలి దేశంగా ఫ్రాన్స్ అవతరించింది. 

  • Written By:
  • Updated On - March 5, 2024 / 10:03 AM IST

Abortion Right : అబార్షన్ (గర్భస్రావం) చేయించుకోవడాన్ని మహిళల రాజ్యాంగపరమైన హక్కుగా గుర్తించిన తొలి దేశంగా ఫ్రాన్స్ అవతరించింది.  1958 నాటి తమ రాజ్యాంగంలో ఈమేరకు ఫ్రాన్స్ ప్రభుత్వం సవరణలు చేసింది. గర్భస్రావాన్ని మహిళల రాజ్యాంగ హక్కుగా గుర్తించే చరిత్రాత్మక బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుకు 780-72 ఓట్ల తేడాతో  ఫ్రాన్స్ పార్లమెంటు గ్రీన్ సిగ్నల్ చూపించింది. ఓటింగ్ ఫలితాలు వెలువడగానే.. పార్లమెంట్‌లోని సభ్యులంతా లేచి నిల్చుని చప్పట్లు కొట్టి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చట్టసభ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయం ఫ్రాన్స్ దేశ గౌరవాన్ని మరింత పెంచిందని దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ తెలిపారు. అయితే ఈమేరకు మార్పులు చేయడాన్ని యాంటీ అబార్షన్ గ్రూప్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాస్తవానికి ఫ్రాన్స్‌లో 1975 సంవత్సరం నుంచే గర్భస్రావం చట్టబద్ధమైనది. అయితే ప్రెగ్నెన్సీని తొలగించుకునే మహిళల హక్కును కాపాడేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని 85 శాతం మంది దేశ ప్రజలు కోరారు. అందుకే ఇప్పుడు దానికి సంబంధించిన  రాజ్యాంగ సవరణ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికే సంతానోత్పత్తికి సంబంధించిన పలు అంశాలలో ప్రజలకు స్వేచ్ఛనిచ్చే చట్టాలు చేశాయి. అయితే అబార్షన్‌ను కూడా రాజ్యాంగపరమైన హక్కుగా గుర్తించిన తొలి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. దేశ రాజ్యాంగానికి 25వ సవరణ చేయడం ద్వారా అబార్షన్‌ను రాజ్యాంగపరమైన హక్కుగా ఫ్రాన్స్ ప్రభుత్వం గుర్తించింది. 2008 సంవత్సరం తర్వాత ఫ్రాన్స్ రాజ్యాంగానికి చేసిన తొలి సవరణ ఇదే. అబార్షన్‌ను రాజ్యాంగపరమైన హక్కుగా(Abortion Right) గుర్తించే అంశంపై ఫ్రాన్స్ పార్లమెంటు నుంచి ప్రకటన వెలువడిన వెంటనే..దేశ రాజధాని పారిస్‌లోని ఈఫిల్ టవర్ ‘బై బాడీ, మై చాయిస్’నే మెసేజ్‌ను ప్రదర్శించారు. ‘‘మీ శరీరం మీదే. మీ శరీరం విషయంలో ఎవరూ నిర్ణయం తీసుకోరు’’ అనే సందేశాన్ని తాము మహిళలందరికీ ఇస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రధానమంత్రి గాబ్రియల్ అట్టల్ అధికారికంగా ప్రకటించారు.

Also Read : BJP MP Ticket : డీకే అరుణకు బీజేపీ టికెట్ ఎందుకు రాలేదు ? రెండో లిస్టులోనైనా టికెట్ దక్కేనా ?

మన దేశంలో అబార్షన్ కోసం.. 

  • కొంతమంది పిల్లలు అప్పుడే వద్దనుకుంటారు. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా ప్రెగ్నెంట్ అయితే.. ముందుగా డాక్టర్‌ని సంప్రదించాలి. అంతేకానీ, సొంత వైద్యం వాడొద్దు.
  • గర్భస్రావం అనేది గర్భంలో ఏర్పడిన పిండాన్ని తీసేయడం. ఇందుకోసం డాక్టర్స్ 10 వారాల వరకూ గర్భాన్ని తొలగించడానికి ట్యాబ్లెట్స్‌ని ఇస్తారు. దీని వల్ల గర్భస్రావం తగ్గుతుంది. మొదటి ఏడు వారాల్లోపు మాత్రలతో గర్భాన్ని తొలగించడం అవుతుంది.
  • కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం.. మాత్రల్ని వాడి గర్భంలో 7 వారాల, 49 రోజుల్లోగా గర్భ స్రావం చేయొచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థల ప్రకారం.. వైద్య గర్భ స్రావానికి 10 వారాల సమయం ఉంటుంది. కానీ, ఇది డాక్టర్స్ మాత్రమే పరీక్షించి చెబుతారు.
  •  ఈ సమయంలో వైద్యులు ఇచ్చిన మందులను తీసుకునేటప్పుడు.. హార్మోన్ల మార్ములు, తిమ్మిర్లు, నొప్పుల వంటి సమస్యలు ఎదురవుతాయి. పీరియడ్స్ టైమ్‌లో బ్లీడింగ్ నార్మల్ కంటే ఎక్కువగా ఉంటుంది. రక్తస్రావం మరికొన్ని రోజులు ఎక్కువగా ఉండొచ్చు. కొందరికి విపరీతమైన వికారం, అలసట, బలహీనత కూడా ఉంటుంది. చాలా రోజుల పాటు సమస్య ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి.
  • మీరు అబార్షన్‌ గురించి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అవసరమైన చర్యలు తీసుకుంటారు. వయస్సు, మిగతా విషయాలు, వ్యక్తుల సమ్మతితో మాత్రమే తీసుకుంటారు.
  • అబార్షన్ చేయించుకోమని కుటుంబంలోని వ్యక్తులు, ఇతరులు ఎవరు కూడా బలవంతం చేయొద్దు.
  • అబార్షన్ చేయించుకోవాలనుకుంటే లైసెన్స్ ఉన్న డాక్టర్స్, గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. అసురక్షిత అబార్షన్ పద్ధతులకి దూరంగా ఉండాలి. సొంత వైద్యాన్ని, ఇతరులు చెప్పిన టిప్స్, ఇంటర్నెట్‌లో సమాచారంతో ఏవి పాటిచొద్దు. దీని వల్ల ప్రాణాపాయం అవ్వొచ్చు.