Kazakhstan: సోవియట్ యూనియన్ (రష్యా)లో భాగమైన కజకిస్థాన్ (Kazakhstan) అడవుల్లో భీకర అగ్నిప్రమాదం జరిగింది. లక్షలాది జంతువులు, పక్షులు అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాయి. కొన్ని మానవ నివాసాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు సగం కాలిపోయిన 14 మంది మృతదేహాలు అక్కడ లభ్యమయ్యాయి. మంటలను ఆర్పేందుకు 1000 మందికి పైగా అగ్నిమాపక దళ సిబ్బందిని రంగంలోకి దించారు.
కజకిస్తాన్ అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో.. దేశంలోని ఈశాన్య అడవులలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఇప్పటివరకు 60,000 హెక్టార్ల (1,48,000 ఎకరాలు) భూమిలో ఉన్న చెట్లు, మొక్కలు, జంతువులు, మానవ నివాసాలను కాల్చివేసాయి. 14 మానవ మృతదేహాలు లభ్యమయ్యాయి. చిక్కుకున్న అటవీ రేంజర్ల కోసం అన్వేషణ కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో 316 మందిని సంఘటనా స్థలం నుండి తరలించామని, అయితే అధిక ఉష్ణోగ్రత, గాలి దిశలో మార్పు కారణంగా పరిస్థితి అదుపు తప్పిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read: Luxury King : హెయిర్ కటింగ్ కు నెలకు 16 లక్షలు.. ఇంట్లో 257 స్నానపు గదులు
పిడుగుపాటు వల్ల అడవుల్లో మంటలు
UNI నివేదిక ప్రకారం.. ఈ అగ్ని ప్రమాదంలో కొన్ని ఇళ్లకు మంటలు వ్యాపించడాన్ని కూడా నిలిపివేశారు. అదే సమయంలో శనివారం కజకిస్తాన్ అధ్యక్షుడు కస్సిమ్-జోమార్ట్ టోకయేవ్ అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ మంత్రి యూరి ఇలిన్‌ను పదవి నుండితొలగించారు. గురువారం పిడుగుపాటు కారణంగా అడవుల్లో మంటలు చెలరేగాయని స్థానిక అధికారులు చెబుతున్నారు. 1,000 మందికి పైగా అధికార సిబ్బంది ఇప్పుడు మంటలను ఆర్పే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం
అగ్నిప్రమాదంలో డజనుకు పైగా మృతి చెందినట్లు ధృవీకరించడంపై రష్యా అధ్యక్షుడు సంతాపం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. కజకిస్థాన్ అధ్యక్షుడు కాసిమ్-జోమార్ట్ టోకాయేవ్‌కు సంతాపం తెలిపారు.
Also Read: Pink Diamond: ప్రపంచంలో అత్యంత విలువైన వజ్రం ఇదే.. రూ. 287 కోట్ల రూపాయలకు విక్రయం..!
ఇంతకు ముందు ఈ దేశం USSRలో భాగం
కజకిస్తాన్ యురేషియాలో ఉంది. ఇది వైశాల్యం ప్రకారం ప్రపంచంలో తొమ్మిదవ అతిపెద్ద దేశం. దీని వైశాల్యం 2,724,900 చ.కి.మీ. ఈ దేశం గతంలో సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేది. 1991లో సోవియట్ యూనియన్ రద్దు తర్వాత చివరకు అది స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది.