Four Human Skulls: విమానాశ్రయంలో మనుషుల పుర్రెల కలకలం..!

మెక్సికో ఎయిర్‌పోర్టులో కొరియర్‌ బాక్సులను తనిఖీ చేస్తుండగా.. వాటిలో 4 మనిషి పుర్రెలు (Four human skulls) కనిపించడంతో కస్టమ్స్ అధికారులు షాకయ్యారు. సంబంధిత డాక్యుమెంట్ల ఆధారంగా మెక్సికోలోని అత్యంత హింసాత్మక రాష్ట్రాల్లో ఒకటైన మిచోవాకాన్‌ నుంచి దక్షిణ కరోలినాకు ఆ పుర్రెలను కొరియర్‌ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

  • Written By:
  • Publish Date - January 3, 2023 / 06:38 AM IST

మెక్సికో ఎయిర్‌పోర్టులో కొరియర్‌ బాక్సులను తనిఖీ చేస్తుండగా.. వాటిలో 4 మనిషి పుర్రెలు (Four human skulls) కనిపించడంతో కస్టమ్స్ అధికారులు షాకయ్యారు. సంబంధిత డాక్యుమెంట్ల ఆధారంగా మెక్సికోలోని అత్యంత హింసాత్మక రాష్ట్రాల్లో ఒకటైన మిచోవాకాన్‌ నుంచి దక్షిణ కరోలినాకు ఆ పుర్రెలను కొరియర్‌ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మెక్సికోలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడి విమానాశ్రయంలో అమెరికాకు పంపుతున్న ప్యాకెట్‌లో నాలుగు మానవ పుర్రెలను దర్యాప్తు అధికారులు గుర్తించారు. నేషనల్ గార్డ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సెంట్రల్ మెక్సికోలోని క్వెరెటారో ఇంటర్‌కాంటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌లో కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసిన పెట్టెలో అల్యూమినియం ఫాయిల్ ,ప్లాస్టిక్‌తో చుట్టబడిన నాలుగు మానవ పుర్రెలను అధికారులు కనుగొన్నారు. ఈ పుర్రెలను ఎందుకు, దేని కోసం తీసుకెళ్తున్నారో విచారణలో చేస్తున్నారు.

Also Read: Temple: 200 ఏళ్ల నాటి దేవాలయంలోకి తొలిసారి ప్రవేశించిన దళితులు..!

దేశంలోని అత్యంత హింసాత్మక ప్రాంతాలలో ఒకటైన పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రం మిచోకాన్ నుండి ప్యాకేజీని పంపినట్లు నేషనల్ గార్డ్ తెలిపింది. ప్యాకేజీని సౌత్ కరోలినాలోని మన్నింగ్‌లోని చిరునామాకు బట్వాడా చేయాల్సి ఉంది. స్కానింగ్‌ మిషన్‌లో ఏదో వింత కనిపించడంతో క్షుణ్ణంగా పరిశీలించామని అధికారులు తెలిపారు. మానవ అవశేషాలను పంపే వ్యక్తి లేదా సంస్థ సమర్థ ఆరోగ్య అధికారం నుండి ప్రత్యేక అనుమతిని పొందవలసి ఉంటుందని, ఈ సందర్భంలో పొందలేదని నేషనల్ గార్డ్ తెలిపింది.