SpaceX Crew 8 : 233 రోజుల తర్వాత భూమికి చేరిన వ్యోమగాములు.. ఎలా అంటే ?

వాస్తవానికి ఈ ఆస్ట్రోనాట్లు(SpaceX Crew 8) ఈ ఏడాది ఆగస్టులోనే భూమికి తిరిగి రావాల్సి ఉంది.

Published By: HashtagU Telugu Desk
Spacex Crew 8 Astronauts Earth

SpaceX Crew 8 : ఇంటర్నేషనల్ స్పేస్​ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఏడు నెలలు(233 రోజులు) గడిపిన నాసా ‘స్పేస్‌ ఎక్స్’ డ్రాగన్ వ్యోమనౌక క్రూ-8 విజయవంతంగా భూమికి తిరిగొచ్చారు. ఫ్లోరిడాలోని పెన్సకోలా సముద్ర  తీరంలో వారు సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. ఈ క్రూలో అమెరికా, రష్యాలకు చెందిన వ్యోమగాములు ఉన్నారు. భూమిపైకి చేరుకున్న వెంటనే ఆస్ట్రోనాట్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు. స్పేస్​ ఎక్స్​ రికవరీ టీమ్స్ పెన్సకోలా సముద్ర  తీరంలో డ్రాగన్ స్పేస్​క్రాఫ్ట్​ను రికవరీ చేసి భద్రపరిచారు. ఈ మిషన్‌లో భాగంగా వ్యోమగాములు 200కుపైగా శాస్త్రీయ పరిశోధనలు చేశారు.

Also Read :Black Bommidai Fish : 8 అడుగుల పొడవు నల్ల బొమ్మిడాయి చేప.. రేటు, టేస్టు వివరాలివీ

  • అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ  ‘నాసా’కు చెందిన వ్యోమగాములు మాథ్యూ డొమినిక్, మైఖేల్ బారెట్, జీనెట్ ఎప్స్.. రష్యాకు చెందిన రోస్కోస్మోస్ సంస్థ వ్యోమగామి అలెగ్జాండర్ గ్రెబెంకిన్ ఈ ఏడాది  మార్చిలో డ్రాగన్ ఎండీవర్‌ రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు.
  • వాస్తవానికి ఈ ఆస్ట్రోనాట్లు(SpaceX Crew 8) ఈ ఏడాది ఆగస్టులోనే భూమికి తిరిగి రావాల్సి ఉంది.
  • సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్​‌లను తీసుకెళ్లిన బోయింగ్ స్టార్​లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు రావడంతో ..వీరిని భూమికి తిరిగి తీసుకొచ్చే మిషన్‌లో జాప్యం జరిగింది.
  • తదుపరిగా అక్టోబ‌ర్ 7న ఈ నలుగురు వ్యోమగాములను భూమికి తీసుకురావాలని భావించారు. అయితే అమెరికాలో సంభవించిన మిల్ట‌న్ తుఫాను కారణంగా ఆ ప్లాన్ కూడా వాయిదా ప‌డింది. ఎట్టకేలకు ఇప్పుడు 233 రోజుల తర్వాత వారు భూమికి సేఫ్‌గా చేరుకున్నారు.
  • ఇక ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్​‌లను భూమికి  తీసుకురావటానికి స్పేస్‌ఎక్స్ క్రూ-9 డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్  వెళ్లింది.  అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2025 ఫిబ్రవరిలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వస్తారు.

Also Read :5000 Shooters : లారెన్స్‌ను చంపేందుకు 5వేల మంది షూటర్లు : యువకుడి వార్నింగ్ వీడియో వైరల్

  Last Updated: 27 Oct 2024, 05:01 PM IST