Site icon HashtagU Telugu

Former YouTube CEO: యూట్యూబ్ మాజీ సీఈఓ కొడుకు మృతి

Former Youtube Ceo

Former Youtube Ceo

Former YouTube CEO: యూట్యూబ్ మాజీ సీఈఓ సుసాన్ వోజ్‌కికి కుమారుడు మార్కో ట్రోపర్(19) మృతి చెందాడు. మార్కో బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని తన వసతి గృహంలో శవమై కనిపించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ మార్కో ట్రోపర్ ని కాపాడలేకపోయామని బర్కిలీ అధికారులు తెలిపారు.

మార్కో ట్రోపర్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎలాంటి క్లూ కనిపించడం లేదని క్యాంపస్ పోలీసులు తెలిపారు. అయితే మార్కో ట్రోపర్ అమ్మమ్మ ఎస్తేర్ వోజ్కికీ అతను డ్రగ్ ఓవర్ డోస్ వల్ల మరణించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని బర్కిలీ క్యాంపస్‌లోని క్లార్క్ కెర్ డార్మ్‌లో మార్కో ట్రోపర్ నివసిస్తున్నాడని క్యాంపస్ పోలీసులు తెలిపారు. మృతికి ముందు అతను గది నుండి బయటకు రాలేదు మరియు తలుపు తట్టినా స్పందించలేదని తెలిపారు. కొంతసేపటికి విశ్వవిద్యాలయ అధికారులు తలుపు తెరిచి చూడగా మృతదేహం గుర్తించామని అన్నారు.

ప్రస్తుతం మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలంలో ఎలాంటి అపశృతి చోటుచేసుకోలేదని క్యాంపస్ పోలీసులు తెలిపారు. అయితే అతను డ్రగ్ ఓవర్ డోస్ వల్లే చనిపోయి ఉంటాడని చిన్నారి అమ్మమ్మ ఎస్తేర్ వోజ్కికీ చెప్పడంతో ఆ దిశగా పోలీసులు విచారిస్తున్నారు.

Also Read: Biden Or Trump: ట్రంప్ లేదా బైడెన్ ఎన్నికల రంగం నుండి తప్పుకుంటే ఏమి జరుగుతుందో తెలుసా..?