Re-Entered to Facebook: ఫేస్‌బుక్‌లోకి రీఎంట్రీ చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్!

రెండేళ్ల తరువాత మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ‘‘నేను మళ్లీ వచ్చేశా’’ అంటూ ట్రంప్ కామెంట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం..

Published By: HashtagU Telugu Desk
Former Us President Trump Has Re-Entered Facebook!

Former Us President Trump Has Re Entered Facebook!

రెండేళ్ల తరువాత మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్‌లోకి రీఎంట్రీ (Re-Entered) ఇచ్చారు. ‘‘నేను మళ్లీ వచ్చేశా’’ అంటూ ట్రంప్ కామెంట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో బాగా సందడి చేస్తోంది. 2021 జనవరిలో అమెరికా చట్టసభల వేదిక ‘క్యాపిటల్‌’ పై ట్రంప్ మద్దతుదారులు దాడికి దిగిన సందర్భంలో ఫేస్‌బుక్ ఆయన అకౌంట్‌పై నిషేధం విధించంది. యూట్యూబ్ కూడా ట్రంప్ అధికారిక అకౌంట్‌ను స్తంభింపజేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు యూట్యూబ్ ట్రంప్ అకౌంట్‌ను బ్లాక్ చేసింది.

ఈ శుక్రవారం ఫేస్‌బుక్, యూట్యూబ్‌లు ట్రంప్ అధికారిక అకౌంట్లను పునరుద్ధరించాయి. ఈ క్రమంలోనే ట్రంప్ వీడియోలు ఆ రెండు వేడుకల్లోనూ దర్శనమిచ్చాయి. ‘‘మిమ్మల్ని ఇంతకాలం వెయిట్ చేయించినందుకు సారీ’’ అని ట్రంప్ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. ఇక వీడియో చివరల్లో.. ‘ట్రంప్ 2024’ అన్న టైటిల్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 2016 నాటి ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌పై గెలిచి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్.. ఆ తరువాతి ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమి చెందారు. ఇక 2024లో జరిగే ఎన్నికల్లో బైడెన్‌ను మట్టి కరిపించి తన ఆధిపత్యం చాటుకోవాలని డోనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు.

Also Read:  Hindu New Year: హిందూ నూతన సంవత్సరంలో ఈ 4 రాశుల వాళ్ళు మెరిసిపోతారు

  Last Updated: 18 Mar 2023, 01:03 PM IST