బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలోనే కాక దక్షిణాసియా రాజకీయ వ్యవస్థలోనూ భారీ ప్రభభావం చూపేలా ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ (ICT) సంచలన తీర్పు వెలువరించింది. గత ఏడాది విద్యార్థుల ఉద్యమాలు దేశవ్యాప్తంగా హింసాత్మక రూపం దాల్చి 1,400 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనపై విచారణ అనంతరం, మాజీ ప్రధాని షేక్ హసీనా సహా మరొక ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. దేశ న్యాయవ్యవస్థ ముందుంచిన సాక్ష్యాలు, ప్రభుత్వ దర్యాప్తు సంస్థల నివేదికలను పరిశీలించిన తరువాత, హింసకి హసీనా ప్రత్యక్ష/పరోక్ష కారణమని ICT అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆమెను దోషిగా తేల్చుతూ కోర్టు మరణశిక్ష విధించడం అంతర్జాతీయ వేదికలపై కూడ తీవ్రమైన చర్చకు దారి తీసింది.
Meera Vasudevan : ముచ్చటగా మూడో భర్త కు విడాకులు ఇచ్చిన హీరోయిన్
ఈ తీర్పు వెలువడిన వెంటనే షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందినట్లు సమాచారం. రాజకీయ ప్రత్యర్థులు, మాజీ మిత్రపక్షాలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ప్రతీ వర్గం దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది. కొందరు ఆమె పాలనా కాలంలో జరిగిన హింసకు ఆమె బాధ్యత వహించడం సహజమే అంటుండగా, మరికొందరు ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్య అని ఆరోపిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో సైనిక, రాజకీయ వర్గాల మధ్య పెరిగిన అంతర్గత ఘర్షణలు ఈ తీర్పుకు దారితీసి ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, ప్రభుత్వం మారిన తర్వాత హసీనాకు వ్యతిరేకంగా అనేక కేసులు నమోదు కావడం ఈ వ్యవహారంలో రాజకీయ కోణం బలంగా ఉందనే అభిప్రాయాన్ని మరింత బలపరుస్తోంది.
Bangladesh Ex Pm Sheikh Hasina : షేక్ హసీనా కు ఉరిశిక్ష విధిస్తూ బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు.!
తనపై వచ్చిన తీర్పును తీవ్రంగా ఖండించిన షేక్ హసీనా, ప్రజలు ఎన్నుకోని “అక్రమ ప్రభుత్వం” తనను శిక్షిస్తున్నదని ఆరోపించారు. బంగ్లాదేశ్ ప్రజలు తాను చేసిన అభివృద్ధిని తెలుసుకుంటారని, ఈ ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమని స్పష్టంగా చెప్పారు. తనపై మోపిన మృతుల సంఖ్య, హింసలో తన పాత్ర వంటి అంశాలలో ఏదీ నిజం లేదని పేర్కొంటూ ఒక అధికారిక స్టేట్మెంట్ విడుదల చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, రాజకీయ భవిష్యత్తుపై ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, హసీనా తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లి అప్పీలు చేసే అవకాశముందా? లేదా ఈ వ్యవహారం అంతర్జాతీయ న్యాయ వేదికలకు వెళదా? అనేవి రాబోయే రోజులలో ప్రధాన చర్చనీయాంశాలు కానున్నాయి.
