US Election Results : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ట్రంప్ గెలుస్తాడా ? భారత సంతతి వనిత కమలా హ్యారిస్ గెలుస్తుందా ? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈక్రమంలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి అందిన తాజా సమాచారం ప్రకారం డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన లీడ్‌లో ఉన్నారు. అమెరికన్ ఎలక్టోరల్ కాలేజీలో(US Election Results) మొత్తం 270 ఓట్లు ఉన్నాయి. వాటిలో 198 ఎలక్టోరల్ ఓట్లను ట్రంప్ సాధించి ముందంజలో నిలిచారు. కమలా హ్యారిస్‌కు కేవలం 109 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా సహా 18 రాష్ట్రాలను ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ విజయఢంకా మోగించింది.
Also Read :Amla Navami 2024: అక్షయ నవమి ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?
డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ ఖాతాలోకి ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలవేర్, మసాచుసెట్స్, రోడ్ ఐల్యాండ్ రాష్ట్రాలు చేరాయి. చాలా ముఖ్యమైనదిగా చెప్పే స్వింగ్ స్టేట్ జార్జియాలో కమలా హారిస్ వెనుకంజలో ఉన్నారు. అక్కడ ట్రంప్ దూసుకుపోతున్నారు. 2020 ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమొక్రాట్లకు 16 ఎలక్టోరల్ ఓట్లను సాధించిపెట్టింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్, ఫిలడెల్ఫియాలో కమల ముందంజలో ఉన్నారు. అక్కడ టఫ్ ఫైట్ నడుస్తోంది. దీంతో ఫలితాన్ని ఇప్పుడే ఊహించడం కష్టతరంగా మారింది.
Also Read :Wedding Season: వామ్మో.. 18 రోజుల్లో రూ. 6 లక్షల కోట్ల వ్యాపారం, దేనిపై ఎంత ఖర్చు అంటే?
స్వింగ్ రాష్ట్రాల్లో కమల లీడ్
ఏడు స్వింగ్ రాష్ట్రాలు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయని చెబుతుంటారు. మిగతా చోట్ల ట్రంప్ హవా ఉన్నప్పటికీ.. స్వింగ్ రాష్ట్రాల్లో మాత్రం కమలా హారిస్ ఆధిక్యం కనిపిస్తోంది. 7 స్వింగ్ రాష్ట్రాలకుగానూ 2 రాష్ట్రాల్లో ట్రంప్, 3 రాష్ట్రాల్లో కమలా లీడ్‌లో ఉన్నారు. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిచిగాన్‌లలో కమల లీడ్‌లో ఉన్నారు.జార్జియా, నార్త్ కరోలినాలో ట్రంప్ దూసుకెళ్తున్నారు. పెన్సిల్వేనియాలో 19, మిచిగాన్‌లో 10, జార్జియాలో 16, విస్కాన్సిన్‌లో 10, నార్త్ కరోలినాలో 16, నెవాడాలో 6, అరిజోనా 11 చొప్పున ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. ఇక అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డెమొక్రాట్లకు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విషెస్ చెప్పారు. తన సొంత రాష్ట్రం డెలావేర్‌లో యూఎస్ సెనేట్ సీటును గెలుచుకున్న లిసా బ్లంట్ రోచెస్టర్‌కు, రాష్ట్ర గవర్నర్‌గా ఎన్నికైన మాట్ మేయర్‌కు అభినందలు తెలిపారు.