పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ పై గుర్తు తెలియని దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇమ్రాన్‌ఖాన్‌తో సహా ఆరుగురు గాయపడగా, ఒకరు మృతి చెందారు.కాల్పులు జరిపాడన్న అభియోగంతో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నుండి కాల్పులు జరపడానికి గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ఇమ్రాన్ కు చికిత్స చేస్తున్న డాక్టర్లు ఆయనకు ప్రాణాపాయం లేదని చెప్తున్నారు.
పాకిస్తాన్ లోని అధికార షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ ఇవాళ గుజ్రన్ వాలాలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఈ సమయంలో దుండగులు ఆయన్ను టార్గెట్ చేసి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన ఆయన సహాయకులు, పార్టీ నేతలు కాపాడే ప్రయత్నం చేసారు. దీంతో వారికి కూడా గాయాలయ్యాయి. వెంటనే ఇమ్రాన్ ఖాన్ ను అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఆస్పత్రికి తరలించారు. 2007లో ఇదే తరహాలో పాకిస్తాన్ మరో మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో ర్యాలీలోనూ దుండగులు కాల్పులు జరిపి ఆమెను హత్య చేశారు. ఇప్పుడు ఇమ్రాన్ ర్యాలీపైనా దాడి చేసి కాల్పులకు దిగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
Footage of the firing. Assassination attempt on Imran Khan. pic.twitter.com/fmSgI2E8jc
— Ihtisham Ul Haq (@iihtishamm) November 3, 2022