Ex PM On Duty : కదన రంగంలోకి మాజీ ప్రధాని.. హమాస్ తో సమరానికి సై

Ex PM On Duty : హమాస్‌ పై యుద్ధం కోసం ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఒకరు నేరుగా కదన రంగంలోకి దూకారు. 

Published By: HashtagU Telugu Desk
Ex Pm On Duty

Ex Pm On Duty

Ex PM On Duty : హమాస్‌ పై యుద్ధం కోసం ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఒకరు నేరుగా కదన రంగంలోకి దూకారు. మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌ సోమవారం రిజర్వ్‌ డ్యూటీ చేయడానికి ఒక సైనిక క్యాంపు దగ్గరికి వచ్చారు.  హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్‌ సైనికులను ఆయన కలిశారు. కరచాలనం చేసి.. వారిలో ధైర్యం నింపారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇజ్రాయెల్, గాజా బార్డర్ ఇప్పుడు దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లుతోంది. గాజా బార్డర్ లో దాదాపు 10వేల మంది ఇజ్రాయెలీ సైనికులు ఉన్నారు. పరస్పర దాడుల్లో ప్రస్తుతం ఇరువైపులా తీవ్ర ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఇప్పటికే రెండు వైపులా కనీసం 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు వేల మందికి పైగా గాయాలపాలయ్యారు. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ పాలనలో ఉన్న గాజాను పూర్తిగా దిగ్బంధించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే గాజాకు వెళ్లే కీలక సరఫరాను నిలిపివేసింది. ఈవిషయాన్ని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి  యోవ్‌ గాలంట్‌ సోమవారం ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join

హమాస్ తో పోరాడుతున్న ఇజ్రాయెల్ కు అమెరికా అండగా నిలుస్తోంది. ఆ దేశానికి సాయం చేసేందుకు యుద్ధ నౌకలు, విమానాలను పంపించింది. అధ్యక్షుడు  జో బైడెన్ ఆదేశాలతో విమాన వాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, దాని వెంట ఉన్న యుద్ధనౌకలను తూర్పు మధ్యధరా ప్రాంతానికి పంపుతున్నామని అమెరికా డిఫెన్స్ విభాగం ‘పెంటగాన్’ తెలిపింది. నౌకలు, విమానాలు తమ కొత్త స్థావరాలకు కదలడం ప్రారంభించాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఆదివారం మధ్యాహ్నం (Ex PM On Duty)  ధృవీకరించింది.

Also read :  Shubman Gill: కోలుకోని గిల్.. రెండో మ్యాచ్ కు దూరమే!

  Last Updated: 09 Oct 2023, 06:03 PM IST