Site icon HashtagU Telugu

Sahara Floods: ఎడారిలో వరదలు.. 50 ఏళ్ల తర్వాత నిండిపోయిన సరస్సు

Sahara Desert Floods Morocco

Sahara Floods : సహారా ఎడారి చాలా ఫేమస్. సహారాలో ఎక్కడ చూసినా భారీ ఇసుక దిబ్బలే కనిపిస్తాయి. ఎడారిలో వరదలు అంటే.. అది సాధ్యమయ్యే విషయం కాదు. ఎడారుల మధ్యలో ఎక్కడో ఒక చోట చిన్నపాటి ఒయాసిస్‌లు ఉంటాయి. కానీ ఎడారిలో వరదలు అనేది చాలా అరుదు. ఆ అరుదైన ఘట్టం ఆఫ్రికా దేశం మొరాకో దేశంలో చోటుచేసుకుంది.

Also Read :Ratan Tata Quotes : రతన్ టాటా చెప్పిన టాప్-10 సూక్తులు ఇవే

మొరాకో పరిధిలోని సహారా ఎడారి ఇసుక దిబ్బలపై ఇప్పుడు వరద నీరు ప్రవహిస్తోంది. ఈ అద్భుత ఫొటోలను, వీడియోలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో మొరాకోలో కొన్ని రోజులు భారీ వర్షాలు కురిశాయి. సహారా ఎడారి ఉండే ఏరియాల్లో వానలు(Sahara Floods) కురిశాయి. దీంతో ఎడారిలోని లక్షల కిలోమీటర్ల మేర ఇసుక దిబ్బలపై వరదనీరు ప్రవహించింది. ఇక్కడి సహారా ఎడారిలో ఇరికీ అనే పేరు కలిగిన ప్రాచీన సరస్సు ఉంది. అది గత 50 ఏళ్లుగా చుక్కనీరు కూడా లేకుండా ఎండిపోయి ఉంది. అయితే తాజా వర్షాలతో ఆ సరస్సులో నీరు నిండింది. ఇప్పుడది నీటితో కళకళలాడుతోంది. ఈ సరస్సుకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలను నాసా విడుదల చేసింది. ఖర్జూర చెట్లు, ఇసుకతిన్నెల మధ్య నీటితో కళకళలాడుతున్న ఇరికి సరస్సు ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సూర్యుడి చుట్టూ భూమి తిరగటంలో తలెత్తిన మార్పుల వల్లే సహారా ఎడారిలో వరదలు వచ్చాయని సైంటిస్టులు అంటున్నారు.

Also Read :Ratan Tata : రతన్ టాటాకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఇవాళ మహారాష్ట్రలో సంతాప దినం

ఈ వర్షాలకు ఇరికి సరస్సు జలకళను సంతరించుకోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. ఆ ప్రాంత ప్రజలకు నీటి విలువ బాగా  తెలుసు. చుక్కనీటిని సహారా ఎడారి ప్రజలు చాలా జాగ్రత్తగా వాడుతుంటారు. వాస్తవానికి మొరాకోను గత ఆరేళ్లు తీవ్ర కరువు వేధించింది. దీంతో రైతుల పొలాలు బీళ్లుగా మారాయి. ఇప్పుడు కురిసిన వర్షాలు వారికి వ్యవసాయంపై ఆశలు రేకెత్తించాయి. మొరాకోలోని సహారా ఎడారి ఏరియాలో ఏటా సగటున 250 మిల్లీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం కురుస్తుంటుంది. అయితే ఇరికి సరస్సు ఉన్న టాగౌనిట్‌ ఏరియాలో కేవలం 24 గంటల వ్యవధిలో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. టాగౌనిట్‌ ఏరియాలో ఇంత తక్కువ టైంలో ఈమేరకు భారీ వర్షం కురవడం గత  30 ఏళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.