America Road Accident : వైసీపీ ఎమ్మెల్యే బంధువులు మృతి

అమెరికా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ (YCP MLA Ponnada Satish Kumar) చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు మరణించారని తెలుస్తుంది. అమెరికా జాన్సన్ కౌంటీ (Johnson County)లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మృతులంతా అమలాపురానికి చెందిన వారిగా గుర్తించారు. We’re now on WhatsApp. Click to Join. ప్రతి నిత్యం ఎక్కడో ఓ చోట ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అతివేగం,నిర్లక్ష్యంగా […]

Published By: HashtagU Telugu Desk
Road Accident In Texas In A

Road Accident In Texas In A

అమెరికా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ (YCP MLA Ponnada Satish Kumar) చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు మరణించారని తెలుస్తుంది. అమెరికా జాన్సన్ కౌంటీ (Johnson County)లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మృతులంతా అమలాపురానికి చెందిన వారిగా గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రతి నిత్యం ఎక్కడో ఓ చోట ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అతివేగం,నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం మత్తులో వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. మరెందరో తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవిస్తుంటారు. తాజాగా అమెరికాలో జరిగిన ప్రమాదంలో వైసీపీ ఎమ్మెల్యే బంధువులు మృతి చెందారు. టెక్సాస్ రాష్ట్రంలోని జాన్స్ కౌంటీలో వైసీపీ ఎమ్మెల్యే బంధువులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ చిన్నాన్న నాగేశ్వరావు కుటుంబం ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వేగంగా వెళ్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబంలోని ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగా, మనవడు, మనవరాలు మృతి చెందారు. అల్లుడు లోకేశ్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. నాగేశ్వరరావు, సీతామహలక్ష్మీ కుమార్తెను చూసేందు అమెరికా వెళ్లారు. అక్కడ పని మీద టెక్సాస్ నుంచి డల్లాస్ లోని ఓ ప్రాంతానికి వెళ్తుండగా నాగేశ్వరరావు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.

ఇక ప్రమాదం విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం అమెరికలోని భారత్ విదేశాంగ అధికారులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. మృతులంతా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉంటారు.

Read Also : BRS Ex MLA Shakeel Son Car Accident case : ఆక్సిడెంట్ చేసి దుబాయ్‌కు పారిపోయిన మాజీ ఎమ్మెల్యే కొడుకు సాహిల్‌

  Last Updated: 27 Dec 2023, 12:57 PM IST