Site icon HashtagU Telugu

Fire At China Mall: చైనాలో భారీ అగ్నిప్ర‌మాదం.. 16 మంది మృతి

Fire At China Mall

Fire At China Mall

Fire At China Mall: చైనాలో బుధవారం (జూలై 17) పెను ప్రమాదం సంభవించింది. చైనాలోని నైరుతి నగరం జిగాంగ్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire At China Mall) సంభవించి 16 మంది మరణించారు. చైనా ప్రభుత్వ మీడియా ప్రకారం.. సిచువాన్ ప్రావిన్స్‌లోని జిగాంగ్ నగరంలో 14 అంతస్తుల భవనం మంటల్లో చిక్కుకుంది. దీంతో చాలా మంది బిల్డింగ్‌లో చిక్కుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.అందులో భవనం నుంచి నల్లటి పొగ రావడం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రభుత్వ మీడియా సిసిటివి ప్రకారం.. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే 300 మంది అత్యవసర సిబ్బంది, డజన్ల కొద్దీ ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎమర్జెన్సీ వర్కర్లు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి భవనం మంటల నుండి సుమారు 30 మందిని రక్షించారు. స్థానిక అధికారులను ఉటంకిస్తూ అగ్నిప్రమాదానికి కారణం నిర్మాణ పనులే అని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, దాని కారణంగా నిప్పురవ్వ చెలరేగిందని, ఆపై మంటలు చెలరేగాయని చెప్పారు. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటకు రాలేదు.

Also Read: Team India Captain: శ్రీలంక పర్యటన.. నేడే భారత జట్టు ప్రకటన, టీ20 కెప్టెన్ ఎవ‌రో..?

ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సూచనలు

చైనా అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో అగ్నిప్రమాదానికి కారణాన్ని వీలైనంత త్వరగా కనుగొనవలసిందిగా రెస్క్యూ వర్కర్లను, ప్రాంతీయ అధికారులను కోరింది. అలాగే ఈ ప్రమాదం నుంచి గుణపాఠం నేర్చుకోండి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టండని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇలాంటి ప్రమాదాలు చైనాలో సర్వసాధారణమైపోయాయి. గతంలో అనేక భవనాల్లో అగ్నిప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో మరణించిన సంఘటనలు ఉన్నాయి. భవనాలు నిర్మించేటప్పుడు నిబంధనలు పాటించకపోవడమే అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

అగ్ని వీడియో చూడండి

ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో కనిపించింది. ఇందులో భవనంపై నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది పైపుల సాయం తీసుకోవడమే కాకుండా డ్రోన్ల ద్వారా మంటలను ఆర్పే పని కూడా చేశారు. అగ్నిప్రమాదం జరిగిన జిగాంగ్ నగరంలోని మాల్‌లో డిపార్ట్‌మెంట్ స్టోర్‌లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్‌లతో పాటు అనేక కంపెనీల కార్యాలయాలు ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

అగ్ని ప్రమాదాలు 19 శాతం పెరిగాయి

చైనాలో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. నేషనల్ ఫైర్ అండ్ రెస్క్యూ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి లి వాన్‌ఫెంగ్ ప్రకారం.. ఈ ఏడాది మే 20 వరకు సేకరించిన డేటా ప్రకారం దేశవ్యాప్తంగా 947 అగ్ని ప్రమాదాలు జరిగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే అగ్ని ప్రమాదాలు 19 శాతం పెరిగాయి. హోటళ్లు, రెస్టారెంట్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు 40% పెరిగాయని లీ చెప్పారు.