Amazon Jobs: ఆర్థిక సంక్షోంభం.. అమెజాన్ లో 18 వేల ఉద్యోగాలు కట్!

ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ (Amazon) కీలక నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Updated On - January 5, 2023 / 11:23 AM IST

ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ (Amazon) కీలక నిర్ణయం తీసుకుంది. పదులు కాదు.. వందలు కాదు.. ఏకంగా 18 వేల ఉద్యోగులను (Jobs) తొలగించనున్నట్టు ప్రకటించింది. నవంబర్‌లో తొలగించిన దానికంటే అధికంగా సుమారు 18 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని కంపెనీ సీఈవో ఆండీ జెస్సీ ఆండీ జాస్సీ చెప్పారు. గత కొన్నేండ్లుగా అధిక సంఖ్యలో నియామకాలు జరుపుతుండటంతోపాటు ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించారు. ఈమేరకు ఉద్యోగులకు ఒక సందేశాన్ని పంపించారు.

జనవరి 18 నుంచి తొలగించే ఉద్యోగలకు సమాచారం అందిస్తామని తెలిపారు. అమెజాన్‌ (Amazon) లో ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం కారణంగా తమ ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగాలపై కోతలు విధించాలని నిర్ణయం తీసుకున్నది. “అనిశ్చితి కారణంగా (Financial crisis) కారణంగా చాలా కష్టంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మేం ఉద్యోగులను నియమించుకున్నాం. కానీ ఆర్థిక పరిస్థితి వల్ల కీలక నిర్ణయం తీసుకున్నామని” అని జాస్సీ ప్రత్యేక నోట్ లో తెలిపారు. అమెజాన్ (Amazon) నిర్ణయంతో ఇతర సంస్థల ఉద్యోగులపై ప్రభావం పడనుంది.

ఉద్యోగాలు (Jobs) కోల్పోయే వారికి తమ మద్దతు కొనసాగుతుందని, సెపరేషన్ పేమెంట్, ట్రాన్సిషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు వంటి ప్యాకేజీలు సహా బయట ఉద్యోగం చూసుకునేందుకు అవసరమైన మద్దతు ఇస్తామని జెస్సీ (Jessy) పేర్కొన్నారు. కొన్ని లే ఆఫ్‌లు ఐరోపాలో ఉంటాయన్న జెస్సీ.. ఈ నెల 18 నుంచి ఉద్యోగులకు సమాచారం అందిస్తామన్నారు.