Site icon HashtagU Telugu

Bus fire Accident : ఘోర బస్సు ప్రమాదం….21మంది సజీవదహనం..మృతుల్లో 12 మంది చిన్నారులు..!!

Pakistan

Pakistan

పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. ఓ బస్సులో మంటలు అంటుకుని…21 మంది సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. సింధ్ ప్రావిన్స్ లోని జంషోరో జిల్లా నూరియాబాద్ సమీపంలో అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఏసీ బస్సులో షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా వరద బాధితులు. కరాచీ నుంచి తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్తుండగా…బస్సు ప్రమాదానికి గురయ్యింది.

అధికారుల వివరాల ప్రకారం…ఆగస్టులో పాకిస్తాన్ లో వరదలు భీకరంగా వచ్చాయి. దీంతో వరద బాధితులను కరాచీలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగవ్వడంతో…వారంతా తిరిగి స్వగ్రామాలకు చేరుకునేందుకు బస్సులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సింధ్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన 45మంది ఏసీ బస్సులో తమ గ్రామాలకు బయలుదేరారు. బస్సు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు కాలి బూడిదయ్యింది. అందులో ఉన్నవారు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. కిటికీలు మూసి ఉండటంతో బయటకు రాలేకపోయారు. మంటలుకొందరు కాలిపోగా…దట్టమైన పొగతో ఊపిరాడక మరికొంతమంది ప్రాణాలు వదిలారు. మరణించినవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.