Site icon HashtagU Telugu

Nigeria Accident : నైజిరియాలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలి 12 మంది మృతి..!!

Nigeriya

Nigeriya

నైజీరియాలో ఘోరప్రమాదం జరిగింది. ఉత్తరమధ్య ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్ పేలింది. ఈ ప్రమాదంలో 12మంది మరణించారు. పెట్రోల్ ట్యాంకర్ ఓ వాహానాన్ని ఢీ కొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 12మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ప్రధాన రహదారిపై వెళ్తున్న ట్యాంకర్ బ్రేకులు ఫెయిలయ్యాయని పోలీసులు తెలిపారు. బ్రేకులు ఫేల్ కావడంతో మరో వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి పెట్రోల్ ట్యాంకర్ పేలిపోయింది. మార్గమధ్యలోని కార్లను ట్యాంకర్ డీకొట్టిందని కోగి పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు మంటల్లో చిక్కుకుని మరణించినట్లు తెలిపారు.

Exit mobile version