Site icon HashtagU Telugu

Colombian Plane Crash : కొలంబియాలో ఘోరప్రమాదం…టేకాఫ్ సమయంలో కూలిన విమానం…8మంది మృతి!!

Colombia (1)

Colombia (1)

సెంట్రల్ కొలంబియాలోని మెడెలిన్ నగరంలో టెకాఫ్ సమయంలో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 8మంది మరణించారు. చిన్నవిమానం కావడంతో అందులో ఉన్న మంది మరణించారు. ఒలాయా హెర్రెరా ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిత తర్వాత విమానం కూలిపోయినట్లు కొలంబియా ఏవియేషన్ అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో ఆరుగురుప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. విమానంలో 8మంది కంటే ఎక్కువ మంది ఉన్నారా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. దీంతో ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియలేదు. విమానం టేకాఫ్ సమయంలో ఇంజన్ ఫెయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విమానం రన్ వే పై కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడు ఇళ్లు ధ్వంసమయ్యాయాని..మరో ఆరు భవనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఫ్లైట్ చోకో పశ్చిమ విబాగానికి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.