Qatar King : ఖతర్ అమీర్ (పాలకుడు) షేక్ తమీమ్ బిన్ హమద్ అల్‌థానీ ప్రస్తుతం భారతదేశ పర్యటనలో ఉన్నారు. ఖతర్ అత్యంత సంపన్న అరబ్ దేశం. భౌగోళికంగా చిన్న సైజులోనే ఉన్నా.. ఈ దేశం సంపద విలువ, ప్రజల తలసరి ఆదాయాలు చాలా ఎక్కువ. ఇక ఖతర్ రాజు షేక్ తమీమ్ ఆస్తిపాస్తుల గురించి తెలిస్తే కళ్లు తిరుగుతాయి.
Also Read :5000 Dollars Gift : పన్ను చెల్లించే వాళ్లకు రూ.4.30 లక్షల గిఫ్ట్.. అందరి ఇళ్లకు చెక్కులు
ఖతర్ రాజు ఆస్తుల చిట్టా
- ఖతర్ రాజు(Qatar King) షేక్ తమీమ్‌ది అల్‌థానీ వంశం.
- ఖతర్ ఏర్పడినప్పటి నుంచి ఆ వంశమే పాలిస్తోంది.
- ప్రస్తుతం అల్‌థానీ వంశంలో 11 మందికి అమీర్ (పాలకుడి)హోదా ఉంది.
- అల్‌థానీ వంశం ఆస్తుల విలువ రూ.29 లక్షల కోట్లు.
- షేక్ తమీమ్ వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.17వేల కోట్లు.
- ఖతర్ రాజధాని దోహాలో ఉన్న రాయల్ ప్యాలెస్‌లో అల్‌థానీ వంశీయులు నివసిస్తారు. ఆ ప్యాలెస్ విలువ రూ.8వేల కోట్లు. దీనికి బంగారంతో తాపడం చేయించారు. అందుకే దీన్ని గోల్డెన్ ప్యాలెస్ అని పిలుస్తారు.
- దోహాలోని రాయల్ ప్యాలెస్‌లో 15 భవంతులున్నాయి. 500 కార్లను నిలిపేంత పార్కింగ్ స్థలం ఉంది.
- ఒమన్ దేశంలో అల్‌థానీ వంశీయులకు వైట్ ప్యాలెస్ ఉంది.
- ఈ కుటుంబానికి లండన్‌లో 17 పడక గదులతో విలాసవంతమైన భవనం ఉంది.
- పారిస్, న్యూయార్క్‌లలోనూ అల్‌థానీ వంశీయులకు మ్యాన్షన్‌లు ఉన్నాయి.
- రూ.3,400 కోట్లు విలువైన విలాసవంతమైన నౌక ఉంది.
- ఖతర్ రాజ కుటుంబం ఖతర్ అమీరి ఫ్లైట్ పేరిట విమానయాన సంస్థను నడుపుతోంది. దానిని 1977లో నెలకొల్పారు. అందులో రాజ కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే ప్రయాణిస్తారు.
- మూడు బోయింగ్ విమానాలతో కలిపి మొత్తం 14 ఫ్లైట్స్ ఈ కంపెనీకి ఉన్నాయి.
- బుగాటి, చిరాన్, లంబోర్గిని, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లు ఖతర్ రాజుకు ఉన్నాయి.
- ఖతర్ రాజ కుటుంబీకులు ఏటా రూ.కోట్లు వెచ్చించి పెయింటిగ్స్ కొనుగోలు చేస్తుంటారు.
- ఖతర్ స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్ (QSI) కంపెనీని స్థాపించి, దాని ద్వారా పలు దేశాల్లో క్రీడా రంగాల్లో ఖతర్ రాజు పెట్టుబడులు పెట్టారు.పలు ఫుట్‌బాల్ ప్రాంచైజీలను కొన్నారు.
- ఖతర్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (QIA) ద్వారా వివిధ దేశాల్లోని సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.