Nobel Prize : రేపటి నుంచే నోబెల్ ప్రైజ్ లపై ప్రకటన.. రేసులో ఉన్నది వీరే

Nobel Prize : రేపటి నుంచి నోబెల్ ప్రైజ్ ల విజేతల పేర్లపై ప్రకటనలు వెలువడబోతున్నాయి. 

  • Written By:
  • Updated On - October 2, 2023 / 10:24 AM IST

Nobel Prize : రేపటి నుంచి నోబెల్ ప్రైజ్ ల విజేతల పేర్లపై ప్రకటనలు వెలువడబోతున్నాయి. తొలుత సోమవారం ఉదయం 11.30 గంటలకు మెడిసిన్ లో నోబెల్ ప్రైజ్ ను స్వీడన్ లోని స్టాక్ హోమ్ నగరంలో  అనౌన్స్ చేయనున్నారు. మంగళవారం భౌతిక శాస్త్రం,  బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్య రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి నోబెల్ ప్రైజ్ లను ప్రకటిస్తారు.  ఇక శుక్రవారం రోజు నోబెల్ శాంతి బహుమతిని అనౌన్స్ చేస్తారు. అక్టోబరు 9న ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ విన్నర్ ను ప్రకటిస్తారు.

Also read : Online Gaming: నిన్నటి నుంచి ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28% జీఎస్టీ.. ప్రయోజనాలు, అప్రయోజనాలు ఇవే..!

నోబెల్  ప్రైజ్ రేసులో వీరే.. 

  • ఈసారి  మెడిసిన్ నోబెల్  ప్రైజ్ కు పోటీపడుతున్న జాబితాలో ముందంజలో హంగరీకి చెందిన కటాలిన్ కారికో, అమెరికాకు చెందిన డ్రూ వైస్‌మాన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ తొలి ఎం-ఆర్ఎన్ఏ కరోనా వ్యాక్సిన్ డెవలప్మెంట్ లో కటాలిన్ కారికో కీలక పాత్ర పోషించారు. ఇక అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ తయారు చేసిన ఎం-ఆర్ఎన్ఏ రకం కరోనా వ్యాక్సిన్ డెవలప్మెంట్ లో డ్రూ వైస్‌మాన్‌ ముఖ్య పాత్ర పోషించారు.
  • నార్కోలెప్సీ పై రీసెర్చ్ లో భాగంగా నిద్రను నియంత్రించడంలో సహాయపడే న్యూరోపెప్టైడ్  ‘ఒరెక్సిన్’ ను ఆవిష్కరించిన శాస్త్రవేత్తల టీమ్ ను కూడా నోబెల్ ప్రైజ్ కు ఎంపిక చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
  • ఊపిరితిత్తులు, పెద్దప్రేగు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లలోవెనుక ఉన్న KRAS క్యాన్సర్ జన్యువును ఎలా నిరోధించాలో కనుగొన్న అమెరికా జీవ శాస్త్రవేత్త కెవాన్ షోకట్‌ కూడా నోబెల్ ప్రైజ్ రేసులో ఉన్నారు.
  • విషపూరిత వాయువులను గ్రహించగల, ఎడారి గాలి నుండి నీటిని సేకరించగల MOFs అని పిలువబడే పోరస్ మెటీరియల్ ను డెవలప్ చేసిన అమెరికా రసాయన శాస్త్రవేత్త ఒమర్ యాగీకి రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ దక్కొచ్చనే అంచనాలు ఉన్నాయి.
  • నోబెల్ సాహిత్య బహుమతి రేసులో రష్యన్ రచయిత, పుతిన్ విమర్శకురాలు లియుడ్మిలా ఉలిట్స్కాయ, చైనీస్ అవాంట్ గార్డ్ రచయిత కెన్ జూ, బ్రిటిష్ రచయిత సల్మాన్ రష్డీ, కరేబియన్-అమెరికన్ రచయిత జమైకా కిన్‌కైడ్, నార్వేజియన్ నాటక రచయిత జోన్ ఫోస్సే పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
  • నోబెల్ శాంతి బహుమతి కోసం ఇరాన్ లో డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించి నిరసన తెలిపి, లాకప్ డెత్ కు గురైన ఉద్యమకారిణి మహసా అమిని పేరును పరిశీలిస్తున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలను డాక్యుమెంట్ చేసిన సంస్థలకు కూడా శాంతి బహుమతిని ప్రకటించే ఛాన్స్ ఉంది.
  • నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతి కోసం.. ఆదాయం, సంపదల అసమానతపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తల టీమ్ ను ఎంపిక చేయాలని (Nobel Prize) యోచిస్తున్నారు.