పాకిస్తాన్ లో దారుణం జరిగింది. బలూచిస్తాన్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని పాకిస్తాన్ లో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. శుక్రవారం సాయంత్రం మసీదు నుంచి తిరిగి వస్తుండగా దాడి చేసి కాల్చిచంపారు. ఈ ఘటన పాకిస్తాన్ లోని అల్లకల్లోల ప్రాంతమైన బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని ఖరాన్ లో జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే జస్టిస్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే న్యాయూమూర్తి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరికి కూడా తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
https://twitter.com/MeeranB35594391/status/1580965165667069952?s=20&t=1wPZomsn4Gcz4VvqxWLeZA