Mashrafe Mortaza: ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నిన్న సైన్యం దేశాన్ని స్వాధీనం చేసుకోగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి అక్కడి నుండి భారత్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత పొరుగు దేశంలో హింస మరింత విస్తరించింది. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మష్రఫె బిన్ మోర్తజా (Mashrafe Mortaza) ఇంటికి కూడా నిప్పుపెట్టేంతగా పరిస్థితి విషమించింది.
మాజీ కెప్టెన్ ఇంటికి ఎందుకు నిప్పు పెట్టారు?
ఈ ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో షేక్ హసీనా పార్టీ నుంచి ఖుల్నా డివిజన్‌లోని నరైల్-2 నియోజకవర్గం నుంచి మష్రఫే ముర్తాజా పోటీ చేశారు. ఇది మాత్రమే కాదు మష్రఫే ముర్తాజా కూడా ఈ ప్రాంతం నుండి రెండవసారి ఎన్నికల్లో గెలిచారు. బంగ్లాదేశ్ మీడియా ప్రకారం..షేక్ హసీనా వైఖరి పట్ల విద్యార్థులు చాలా రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఆ తర్వాత దేశంలో హింస, కాల్పులు మొదలయ్యాయి. కాగా షేక్ హసీనా సోమవారం దేశం విడిచి వెళ్లిపోయారు. దేశం విడిచిపెట్టిన తర్వాత దుండగులు మష్రఫే ముర్తాజా ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు.
Also Read: Sheikh Hasina: షేక్ హసీనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు: కుమారుడు
మష్రఫే మొర్తజా క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత 2018లో షేక్ హసీనా అవామీ లీగ్‌లో చేరాడు. ఇక్కడి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో విజయం సాధించారు.
We’re now on WhatsApp. Click to Join.
మష్రఫే మొర్తజా క్రికెట్ కెరీర్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు మష్రఫే మొర్తజా 117 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. అంతేకాకుండా మష్రఫే మొర్తజా జట్టు తరపున 36 టెస్టులు, 220 వన్డేలు, 54 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 36 టెస్టు మ్యాచ్‌ల్లో మాజీ కెప్టెన్ బ్యాటింగ్‌లో 797 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 78 వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు వన్డేల్లో 270 వికెట్లు, 1787 పరుగులు తీశారు. టీ20లో 42 వికెట్లు, 377 పరుగులు చేశారు.