Site icon HashtagU Telugu

Iran : ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలో 70 మంది మృతి.. జైలు దాడిపై వివరణ

Iran

Iran

Iran : ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లోని ఈవిన్ హైసెక్యూరిటీ జైలుపై జూన్ 23న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిపై ఇప్పటికీ అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దాడి అనంతరం, జైలులో ఉన్న ఇజ్రాయెలీ గూఢచారులను లక్ష్యంగా చేసుకున్నదేనా? అన్న అనుమానాలపై ఇరాన్ జ్యుడిషియల్ వ్యవస్థ స్పందించింది.

ఇరాన్ న్యాయవ్యవస్థ అధికార ప్రతినిధి అస్గర్ జహాంగీర్ ప్రకారం, ఈ దాడిలో ఇజ్రాయెలీ గూఢచారులకు ఎలాంటి హాని జరగలేదని, స్పష్టంగా తెలిపారు. జైలు దాడిలో ఐదుగురు ఖైదీలు మరణించారని తెలిపారు. అయితే, వారిలో కొందరు ఆర్థిక నేరాల్లో అరెస్టయినవారేనని వెల్లడించారు.

మిజానోన్‌లైన్ అనే న్యాయవ్యవస్థ అధికార వెబ్‌సైట్ ప్రకారం, ఈ దాడిలో “చాలా తక్కువ సంఖ్యలో ఖైదీలు మృతి చెందారు” అని తెలిపింది. కొన్ని “అత్యంత తక్కువ సంఖ్యలో ఖైదీలు” జైలు నుంచి తప్పించుకున్నారని, వారిని తిరిగి అదుపులోకి తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతోందని పేర్కొన్నారు.

ఈ దాడితో ఇజ్రాయెల్ అంతర్జాతీయ న్యాయాలకు పట్టించుకోదన్న సందేశం ఇచ్చే ప్రయత్నం చేసిందని జహాంగీర్ ఆరోపించారు. ఈ దాడి ఇరాన్ ప్రజలను భయపెట్టేందుకు, దేశంపై మద్దతు తగ్గించేందుకు చేసిన చర్యగా అభివర్ణించారు.

ఈవిన్ జైలుపై దాడిలో కేవలం ఖైదీలే కాకుండా, జైలును సందర్శించేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు, జైలు సిబ్బంది, పక్కనున్న భవనాల్లో నివసించే సాధారణ పౌరులు సహా 70 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని సమాచారం.

ఇజ్రాయెల్ జూన్ 13న మొదలు పెట్టిన ఈ వైమానిక దాడుల్లో న్యూక్లియర్ సైంటిస్టులు, సైనికాధికారులు, సాధారణ పౌరులు మరణించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ పలుసార్లు క్షిపణి, డ్రోణ్ దాడులు జరిపింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 12 రోజులపాటు తీవ్ర ఘర్షణ కొనసాగింది. చివరకు జూన్ 24న కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి.

Fire : చెన్నై సమీపంలో గూడ్స్ రైలులో భారీ అగ్నిప్రమాదం..