Site icon HashtagU Telugu

Covid: చైనాలో ఎక్కడ చూసినా శవాలే..మళ్లీ కరోనా అలజడి

Singapore

Covid 19

చైనాలో కరోనా కేసులు మళ్లీ ఎక్కువయ్యాయి. చైనాలో తాజాగా జీరో కొవిడ్ నిబంధనను ఎత్తివేశారు. దీంతో వేల సంఖ్యలో చైనా కేసులు పుట్టుకొస్తున్నాయి. ఆస్పత్రులన్నీ కూడా రోగులతో పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. మరో మూడు నెలల్లో చైనాలో 60 శాతం మందికి పైగా కరోనా బారిన పడతారని నిపుణులు తెలుపుతున్నారు. ఇదే టైంలో చైనాలో భారీ ఎత్తున మరణాలు అనేవి సంభవిస్తాయని వారు అంటున్నారు.

ముఖ్యంగా చైనాలోని ప్రధాన నగరాల్లో శ్మశానవాటికలకు వందలాది శవాలు వస్తున్నాయని పలు వార్తా సంస్థలు తెలుపుతున్నాయి. అయితే చైనా మాత్రం తమ దేశంలో మరణాలనేవే నమోదు కావడం లేదని ఖరాకండీగా చెబుతోంది. మరణాల సంఖ్యను దాచేసే ప్రయత్నం చైనా చేస్తోంది. కరోనా వైరస్ కారణంగా మరణాలను నమోదు చేయడానికి ఉపయోగించే ప్రమాణాలను చైనా దేశం ఇటీవలె మార్చివేసింది.

ఈ నెల 20వ తేది వరకూ కూడా కరోనా వల్ల ఎవ్వరూ చనిపోలేదని చైనా బుధవారం అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం పలు దేశాల్లో కరోనా వైరస్ కారణంగా పలు మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే చైనా మాత్రం ఆ మార్గదర్శకాలను అస్సలు పాటించడం లేదని తెలుస్తోంది.

కరోనా వల్ల బీజింగ్ నగరంలో సోమవారం ఐదుగురు మరణించారు. అయితే మొత్తంగా చూస్తే కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకూ 5,241 మరణాలు సంభవించినట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. మరోవైపు దేశంలో తాజాగా 3,101 కొత్త కేసులు నమోదయ్యాయని, దాంతో ప్రస్తుత కేసుల సంఖ్య 3,86,276కి చేరుకున్నట్లు సమాచారం.

Exit mobile version