Aeolus: భూమిపై క్రాష్ కాబోతున్న 1360 కేజీల శాటిలైట్.. తర్వాత జరగబోయేది ఇదే?

నిత్యం సోషల్ మీడియాలో అంతరిక్షంకి సంబంధించిన ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తరచూ అంతరిక్షం కి సంబంధించి శాస్త్రవేత్తలు ప

  • Written By:
  • Publish Date - May 9, 2023 / 08:00 PM IST

నిత్యం సోషల్ మీడియాలో అంతరిక్షంకి సంబంధించిన ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తరచూ అంతరిక్షం కి సంబంధించి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర అప్డేట్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే భూమిపై మరొక శాటిలైట్ కుప్పకూలేందుకు సిద్ధమవుతోంది. 1360 కేజీల శాటిలైట్ భూమిపై క్రాష్ కానుంది. కాగా యూరప్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించిన ఏయోలస్ కృత్రిమ ఉపగ్రహం జీవితకాలం చివరి అంకానికి చేరుకుంది.

ప్రస్తుతం 320 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతున్న ఈ అంతరిక్షం నౌక వేగంగా తన ఇంధనాన్ని కోల్పోతోంది. దాదాపుగా దాని ఇందన నిలువలు క్షీణించాయని చెప్పవచ్చు. అయితే ఉపగ్రహానికి సంబంధించిన లేజర్ పరికరాలు ఇంకా పనిచేస్తున్నాయి. ఈ సాటిలైట్ కు చెందిన సైన్స్ పరికరాలను ఏప్రిల్ 30వ తేదీన నిలిపివేశారు. ఎర్త్ ఎక్స్ ప్లోరర్ రీసెర్చ్ మిషన్ కింద ఏయోలస్ సాటిలైట్ ను ఐదేళ్ల క్రితం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించింది. అయితే ప్రస్తుతం అందులోని ఇంధనం పూర్తిగా క్షీణించి పోవడంతో భూమికి 320 కిలోమీటర్ల ఎత్తులో చుట్టూ పరిభ్రమిస్తున్న ఈ శాటిలైట్ ఇప్పటికే భూమి పలుచని వాతావరణం లోకి ఎంట్రీ ఇచ్చింది.

భూమి గురుత్వాకర్షణ శక్తి నెమ్మదిగా దీన్ని లాగేసుకుంటోంది. దీంతో పాటుగా సూర్యుడు నుంచి వచ్చే ప్లాస్మా తరంగాలు భూమి వైపుగా శాటిలైట్ ను మరింతగా నెడుతున్నాయి. రాబోయే కొన్ని నెలల్లో దీని ఎత్తున 320 కిలోమీటర్ల నుంచి క్రమంగా 280 కిలోమీటర్లకు ఆ తర్వాత 150 కిలోమీటర్లకు తగ్గించబడుతుంది. శాటిలైట్ 80 కిలోమీటర్ల కిందకు దిగగానే భూ వాతావరణ ఘర్షణ కారణంగా ఆకాశంలోనే కాలి బూడిద అవుతుంది అని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దీనివల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఆ శాటిలైట్ ముక్కలు ముక్కలుగా విడిపోయే అన్ని భాగాలను సముద్రంలా పడేలా చేస్తుందని తెలిపారు శాస్త్రవేత్తలు.