Site icon HashtagU Telugu

Mars Water: ఆ గ్రహం మీద నివసించచ్చు అంటోన్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ!

Mars

Mars

అంగారకుడు (మార్స్) మీద నీరు ఉందని… నీరు ఎక్కడ ఉందనేది చూపించడానికి దాని లొకేషన్, ఆ లొకేషన్ చూపించే మ్యాప్ కూడా తమ దగ్గర ఉందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ప్రకటించింది. దశాబ్దం పాటు సాగిన తమ సుదీర్ఘ పరిశోధనలకు ఫలితం అన్నట్లు… నీరు ఉందని చూపించే ఫోటోలు విడుదల చేసింది.

భవిష్యత్తులో మనం నివాసం ఉండటానికి భూమికి దగ్గరలో ఉన్నది ఏదైనా ఉందంటే… అది అంగారక గ్రహమే. అందులో ఒకప్పుడు మనిషికి జీవనాధారమైన నీరు ఉండేది. అయితే… ఇప్పుడు ఆ నీటిని నీరు కోల్పోయింది. అంగారక గ్రహం ఉపరితలంపై ఇప్పుడు నీటి జాడలు లేవు. అయితే, స్పేస్ ఏజెన్సీ పరిశోధనల్లో రెడ్ ప్లానెట్‌పై ఒకప్పుడు జీవనదులు, సరస్సులు ఉన్నాయని నిర్ధారణకు వచ్చారు.

ఇప్పుడు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ఒక అడుగు దగ్గరగా వెళ్లి అంగారక గ్రహం యొక్క మొదటి నీటి పటాన్ని విడుదల చేసింది, భవిష్యత్తులో మానవులు ఎక్కడికి వెళ్లగలరో చూపిస్తుంది. పటాలు పరిశోధన మరియు పరిశీలనల యొక్క గత దశాబ్దంలో గ్రహం అంతటా ఉన్న ఖనిజ నిక్షేపాలను వివరంగా చూపుతాయి. మానవులు అంగారక గ్రహంపై అడుగు పెట్టడానికి ముందు, సరైన శాస్త్రీయ విలువను అందించగల మిషన్‌లకు సరిపోయే ప్రదేశాలను గుర్తించడంలో ఈ మ్యాప్ సహాయపడుతుంది.