Site icon HashtagU Telugu

Eric Garcetti: భారత్ లో అమెరికా కొత్త రాయబారిగా ఎరిక్ గార్సెట్టి..!

Eric Garcetti

Resizeimagesize (1280 X 720) (2)

లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్ ఎరిక్ గార్సెట్టి (Eric Garcetti) భారత్‌లో కొత్త అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టితో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ శుక్రవారం అధికారికంగా ప్రమాణం చేయించారు. భారత్‌లో అమెరికా రాయబారి పదవి గత రెండేళ్లుగా ఖాళీగా ఉంది. ఈ నెల ప్రారంభంలో US సెనేట్ భారతదేశంలో తదుపరి US రాయబారిగా గార్సెట్టి నామినేషన్‌ను ధృవీకరించింది. దీంతో రెండేళ్లకు పైగా ఖాళీగా ఉన్న భారత్‌లో అమెరికా రాయబారి పదవికి గార్సెట్టి నియామకానికి మార్గం సుగమమైంది.

ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత తన కొత్త దౌత్య పాత్ర గురించి అడిగిన ప్రశ్నకు గార్సెట్టి.. “నేను ఈ పదవిలో పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను” అని అన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గార్సెట్టి భార్య అమీ వీక్‌ల్యాండ్, తండ్రి గిల్ గార్సెట్టి, తల్లి సుకే గార్సెట్టి, అత్తగారు డీ వీక్‌ల్యాండ్, అనేక ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఎరిక్ గార్సెట్టి ఎవరు..?

ఎరిక్ గార్సెట్టి ఫిబ్రవరి 4, 1971న లాస్ ఏంజిల్స్‌లో జన్మించాడు. ఎరిక్ ఆసక్తిగల ఫోటోగ్రాఫర్. జాజ్ పియానిస్ట్ స్వరకర్త. అతను US నేవీ రిజర్వ్ ఇన్ఫర్మేషన్ డామినెన్స్ కార్ప్స్‌లో లెఫ్టినెంట్‌గా ఉన్నారు. 2013లో తొలిసారిగా లాస్ ఏంజెల్స్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2017లో మళ్లీ మేయర్‌ అయ్యారు. దీనికి ముందు 2006 నుండి 2012 వరకు అతను లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అతను మేయర్‌గా ఎన్నికయ్యే ముందు అతను, అతని కుటుంబం ఎకో పార్క్‌లో నివసించారు. ఎరిక్ బైడెన్‌కు సన్నిహితుడిగా పరిగణించబడ్డాడు. 50 ఏళ్ల ఎరిక్ అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉన్నారు. బైడెన్ కూడా ప్రధాన రాజకీయ మిత్రుడు.

Also Read: Mark Zuckerberg: మరోసారి తండ్రయిన మెటా సీఈవో జుకర్‌బర్గ్

ఎరిక్ గార్సెట్టి సన్నిహితుడు రిక్ జాకబ్స్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మేయర్ పదవిలో ఉంటూ ఎరిక్ ఈ విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ఆరోపణ కారణంగా ఎరిక్ గార్సెట్టి నియామకం జరగలేదు. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీతో పాటు, కొంతమంది డెమొక్రాట్ ఎంపీలు కూడా ఎరిక్ గార్సెట్టి వాదనను వ్యతిరేకించారు. గార్సెట్టి బైడెన్ ఎన్నికల ప్రచారానికి కో-ఛైర్మన్‌గా ఉన్నాడు. అతను ఇప్పటికీ అధ్యక్షుడికి అత్యంత సన్నిహిత, అత్యంత ముఖ్యమైన రాజకీయ మిత్రుడు. అతను బైడెన్ క్యాబినెట్‌లో చేరవచ్చని నమ్ముతారు. అయితే రిక్ జాకబ్స్ వివాదం తర్వాత అతని అవకాశాలు నిలిచిపోయాయి.