Elon Musk: బాత్ రూమ్ కు కూడా బాడీ గార్డ్స్ తో వెళ్తున్న మస్క్.. ఎందుకంటే..?

ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి మరో కొత్త విషయం బయటికొచ్చింది. శాన్ ఫ్రాన్సిస్కో లోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి మస్క్ ఇద్దరు బాడీగార్డులతో వస్తున్నారనే వార్తపై ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది.

  • Written By:
  • Publish Date - March 8, 2023 / 07:15 AM IST

ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి మరో కొత్త విషయం బయటికొచ్చింది. శాన్ ఫ్రాన్సిస్కో లోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి మస్క్ ఇద్దరు బాడీగార్డులతో వస్తున్నారనే వార్తపై ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది. సాక్షాత్తు ఈ విషయాన్ని ట్విట్టర్ హెడ్ ఆఫీసులో పనిచేసే ఓ ఇంజనీర్ చెప్పాడంటూ ప్రముఖ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. “ఎలాన్ మస్క్ కు ట్విట్టర్ ఉద్యోగులపై అస్సలు నమ్మకం లేదు. అందుకే ఆయన ఆఫీసులో ఇద్దరు బాడీ గార్డ్స్ తో తిరుగుతున్నారు. చివరకు బాత్ రూమ్ వరకు కూడా బాడీ గార్డ్స్ తోనే వెళ్తున్నారు. దీన్నిబట్టి మస్క్ ఎలా ఆలోచిస్తున్నారో.. ఎలా ఎంప్లాయిస్ ను సందేహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఆ బాడీ గార్డ్స్ చాలా హైట్ గా హాలీవుడ్ మూవీ క్యారెక్టర్స్ లా ఉన్నారు” అని ఆ ఇంజనీర్ చెప్పారు.

■ఉద్యోగులపై పెరిగిన ప్రెషర్

ట్విట్టర్ లో ఉద్యోగులపై పనిభారం పెరిగిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పటివరకు చాలామందిని జాబ్స్ నుంచి తీసేశారు. దీంతో ఉన్న ఉద్యోగులపై వర్క్ ప్రెషర్ పెరిగింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ట్విట్టర్లో సాంకేతిక, నిర్వహణ పరమైన లోపాలు తలెత్తే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: Meta Layoffs: వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు మెటా ప్లాన్.. త్వరలోనే తొలగింపులు..!

■ ఉద్యోగితో మస్క్ చాట్

ఇటీవల ఎలాన్ మస్క్ ను ఒక ఉద్యోగి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు. “ప్రియమైన ఎలాన్ మస్క్.. 9 రోజుల క్రితం నా వర్క్ కంప్యూటర్‌కి యాక్సెస్ కట్ చేయబడింది. నాతో పాటు మరో 200 మంది ట్విట్టర్ ఉద్యోగులకు ఇలాగే జరిగింది . అయితే, నేను ఇప్పుడు ఉద్యోగినా కాదా అని మీ హెచ్‌ఆర్ హెడ్ ఇప్పటికీ నిర్ధారించ లేదు. మీరు నా ఇమెయిల్‌లకు సమాధానం ఇవ్వలేదు. తగినంత మంది వ్యక్తులు రీట్వీట్ చేస్తే.. మీరు నాకు ఇక్కడ సమాధానం ఇస్తరేమో?” అని ప్రశ్న సంధించాడు.

స్పందించిన మస్క్ .. “మీరు ఏ పని చేస్తున్నారు?” అని అడిగారు. దానికి సంబంధించిన సమాధానాన్ని ఎంప్లాయీ ఇచ్చాక..” మిమ్మల్ని జాబ్ నుంచి తొలగించినట్లు స్పష్టీకరణ పొందాను” అని మస్క్ చెప్పారు. “నాకు రావాల్సిన డ్యూస్ అన్నీ క్లియర్ చేశారో లేదో కన్ఫామ్ చేయగలరా? ” అని ఆ ఉద్యోగి మళ్లీ మస్క్ ను అడిగాడు. దీనికి మస్క్ ఇంకా సమాధానం ఇవ్వాల్సి ఉంది.