Elon Musk – Gaza : ఆ ఆదాయమంతా గాజా, ఇజ్రాయెల్‌కు ఇచ్చేస్తా : మస్క్

Elon Musk - Gaza : అపర కుబేరుడు, ఎక్స్ (ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 11:23 AM IST

Elon Musk – Gaza : అపర కుబేరుడు, ఎక్స్ (ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. మరోసారి ఆయన తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అక్టోబరు 7 నుంచి యుద్దంలో నలిగిపోతున్న ఇజ్రాయెల్, గాజా సామాన్య పౌరులకు అండగా నిలిచేందుకు మస్క్ ముందుకొచ్చారు. అక్టోబరు 7న యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ట్విట్టర్ వేదికగా యుద్ధానికి సంబంధించిన అన్ని రకాల పెయిడ్ పోస్టులు, సబ్ స్క్రిప్షన్స్, యాడ్స్ ద్వారా సమకూరిన మొత్తం ఆదాయాన్ని విరాళంగా అందిస్తున్నట్లు ఆయన అనౌన్స్ చేశారు. ఈ నిధులను ఇజ్రాయెల్‌లోని హాస్పిటళ్లకు, గాజాలో ప్రజలకు సేవలందిస్తున్న రెడ్ క్రాస్, రెడ్ క్రీసెంట్ సంస్థలకు డొనేషన్‌గా అందిస్తామని ప్రకటించారు.ఈ నిధులను ఆయా సంస్థలు ఎలా ఖర్చు చేస్తాయనేది ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తామని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ట్విట్టర్ విరాళంగా ఇస్తున్న నిధులు హమాస్‌ మిలిటెంట్లకు చేరకుండా ఎలా ఆపుతారు అని ట్విట్టర్ వేదికగా ఎలాన్ మస్క్‌ను ఒక నెటిజన్ ప్రశ్నించగా.. “మేము నిధులు ఖర్చయ్యే తీరును ట్రాక్ చేస్తాం. రెడ్ క్రాస్, రెడ్ క్రీసెంట్ ద్వారా ప్రజలకు సాయం చేస్తాం. ఈక్రమంలో మంచి ఆలోచనలు ఎవరు ఇచ్చినా స్వాగతిస్తాం’’ అని తెలిపారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో అమాయక గాజా పౌరులు చనిపోతున్న వివరాలు తెలిపే పోస్టులు, వార్తలు, వీడియో క్లిప్‌లలో తమ కంపెనీల యాడ్స్‌ను ట్విట్టర్‌లో చూపించడంపై ప్రముఖ కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అలాంటి కంటెంట్‌లో తమ యాడ్స్‌ను పోస్ట్ చేయొద్దని సూచించాయి. ఈనేపథ్యంలో ఆ విధంగా సంస్థకు వచ్చిన ఆదాయం మొత్తాన్ని గాజా, ఇజ్రాయెల్‌లో ప్రజల సహాయం కోసమే ఇచ్చేస్తానని మస్కక్ అనౌన్స్ చేశారు. తద్వారా తమ సంస్థకు యాడ్స్ ఇచ్చే సంస్థల(Elon Musk – Gaza) మనసు గెలుచుకునేందుకు ఆయన యత్నించారు.

Also Read: Gaddam Vinod : గడ్డం వినోద్ నివాసంలో ఈడీ సోదాలు.. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతిపై ఇన్వెస్టిగేషన్