Site icon HashtagU Telugu

Musk Vs Putin : అలా జరిగితే పుతిన్‌ను చంపేస్తారు.. మస్క్‌ సంచలన కామెంట్

Musk Vs Putin

Musk Vs Putin

Musk Vs Putin : అమెరికాకు చెందిన అపర కుబేరుడు, ట్విట్టర్ (ఎక్స్) యజమాని ఎలాన్ మస్క్  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదు. ఒకవేళ ఈ యుద్ధ రంగం నుంచి  రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వెనక్కి తగ్గితే, ఆయన్ను హతమార్చే ఛాన్స్ ఉంది. అందుకే ఆయన ఇంకా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నారు’’ అని మస్క్ కామెంట్ చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపితే.. హత్యకు గురయ్యే ఛాన్స్ ఉందనే భయంతోనే పుతిన్ వెనక్కు తగ్గడం లేదని వ్యాఖ్యానించారు.  ట్విట్టర్‌ (ఎక్స్)కు చెందిన ‘స్పేసెస్‌’ వేదికపై రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలో ఎలాన్ మస్క్ సోమవారం ఈ కామెంట్స్ చేశారు. గతంలోనూ మస్క్ ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. పుతిన్‌పై(Musk Vs Putin) ఇలా మాట్లాడుతున్నందుకు తనను చాలా మంది విమర్శిస్తున్నారని వాపోయారు. అసలు వాస్తవాలను తెలుసుకోవాలని అలాంటి వారికి సూచించారు. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగడం వల్ల రష్యాకు, ఉక్రెయిన్‌కు నష్టం కలుగుతుందన్నారు. అమెరికా ప్రకటించిన ఆర్థిక సాయం వల్ల  ఉక్రెయిన్‌కు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని మస్క్ అభిప్రాయపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join

రష్యాను సైనికంగా అణచివేయడానికి తన కంపెనీలు గొప్పగా పనిచేశాయని మస్క్‌  అన్నారు. ఉక్రెయిన్‌కు స్పేస్‌ఎక్స్‌ స్టార్‌లింక్‌ సేవలను అందిస్తోందని ఆయన గుర్తుచేశారు. రష్యాకు వ్యతిరేకంగా కీవ్‌ సమాచార వ్యవస్థలో స్టార్ లింక్ ఇప్పుడు కీలకంగా మారిందన్నారు. రష్యా అంతరిక్ష వ్యాపారాల నుంచి స్పేస్‌ఎక్స్‌ దూరం జరిగిందని మస్క్ వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ దేశాలలో ప్రాణనష్టాన్ని నిలువరించడమే తన లక్ష్యమన్నారు.రష్యాలో పుతిన్‌‌ను గద్దె దించాలనుకునేవారు ఆయన స్థానంలో ఎవరిని కోరుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఈసందర్భంగా ప్రశ్నించారు. రష్యాలో కాబోయే కొత్త ప్రెసిడెంట్ శాంతికాముకుడై ఉంటారని ఎలా అనుకోగలమని.. కొత్త ప్రెసిడెంట్ పుతిన్ కంటే కఠినాత్ముడైనా ఆశ్చర్యపోనవసరం ఉండదన్నారు.

Also Read : Gmail Feature : జీమెయిల్‌ ‘రిప్లై’ సెక్షన్‌లో కొత్త ఫీచర్.. ఏమిటో తెలుసా ?

ఉక్రెయిన్‌కు రూ.498 కోట్ల సాయం

ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌, తైవాన్‌లకు రూ.791 కోట్ల సహాయం అందించడానికి ఉద్దేశించిన బిల్లును అమెరికా సెనెట్‌ ఆమోదించింది. ఇందులో నుంచి రూ.498 కోట్లను ఒక్క ఉక్రెయిన్‌కే ఇస్తారు. ఈ సహాయాన్ని ప్రతిపక్ష రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నందున బిల్లు చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉంది. చివరకు 22 మంది రిపబ్లికన్లు పాలక డెమోక్రాట్లతో చేతులు కలపడంతో సెనెట్‌లో బిల్లు 70-29 ఓట్లతో నెగ్గింది.