Twitter Verification: ఇకపై మూడు రంగుల్లో ట్విట్టర్ వెరిఫై టిక్..!

మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసినప్పటి నుండి ఈ మైక్రో బ్లాగింగ్ సైట్‌లో కలకలం రేగుతోంది.

  • Written By:
  • Publish Date - November 25, 2022 / 04:44 PM IST

మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసినప్పటి నుండి ఈ మైక్రో బ్లాగింగ్ సైట్‌లో కలకలం రేగుతోంది. ఎలాన్ మస్క్ ఒకదాని తర్వాత ఒకటి అనేక ప్రధాన మార్పులు చేశాడు. కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాడు. వందల మంది ఉద్యోగులను తొలగించాడు. ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతాలకు వేర్వేరు రంగుల్లో బ్యాడ్జ్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వ ఖాతాలకు స్పష్టమైన తేడా ఉండేలా ఈ బ్యాడ్జ్‌లను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కంపెనీలకు గోల్డ్, వ్యక్తులకు బ్లూ, ప్రభుత్వ ఖాతాలకు గ్రే కలర్ టిక్‌ను ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఎలాన్ మస్క్ ట్విట్టర్ బ్లూ సర్వీస్‌ను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ బ్లూ డిసెంబర్ 2న పునఃప్రారంభించబడుతుంది. Twitter బ్లూ అనేది ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఆధారిత సేవ. ట్విట్టర్ బ్లూని మళ్లీ ప్రారంభించడంతో ఇప్పుడు ట్విట్టర్ టిక్ (చెక్ మార్క్) రంగు కూడా భిన్నంగా ఉండనుంది. సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వ ఖాతాలకు స్పష్టమైన తేడా ఉండేలా ఈ బ్యాడ్జ్‌లను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కంపెనీలకు గోల్డ్, వ్యక్తులకు బ్లూ, ప్రభుత్వ ఖాతాలకు గ్రే కలర్ టిక్‌ను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇది కాకుండా వెరిఫై చేయబడిన అన్ని ఖాతాల రీ-వెరిఫికేషన్ ఉంటుంది. ఇంతకు ముందు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు, సెలబ్రిటీలకు ట్విట్టర్‌లో బ్లూ టిక్‌లు ఉండేవి. ట్విట్టర్ బ్లూను మళ్లీ ప్రారంభించడంలో ఆలస్యమైనందుకు ఎలాన్ మస్క్ క్షమాపణలు కూడా చెప్పాడు. ట్విట్టర్ బ్లూ కోసం వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. US, ఇతర దేశాలలో దీని ధర $8 అని చెప్పబడుతున్నప్పటికీ, భారతదేశంలో Twitter బ్లూ ధర రూ.720 అని సమాచారం.

మరోవైపు.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను సస్పెన్షన్‌ ననుంచి తొలగించాడు. ట్రంప్ సస్పెండ్ చేసిన ఖాతాను తిరిగి పొందిన తర్వాత ఇప్పుడు ఎలాన్ మస్క్ మరో పెద్ద ప్రకటన చేశాడు. సస్పెండ్ అయిన మిగతా యూజర్ల ఖాతాలను వచ్చే వారం నుంచి మళ్లీ యాక్టివేట్ చేస్తానని తెలిపాడు. దీని కోసం గురువారం ట్విట్టర్‌లో ఓ పోల్‌ను నిర్వహించాడు. విద్వేష వ్యాఖ్యలు, నకిలీ సమాచార వ్యాప్తి వంటి కారణాలతో గతంలో నిలిపివేసిన ఖాతాలను ట్విట్టర్ పునరుద్ధరించనుంది. ‘నిలిపివేసిన ఖాతాలకు క్షమాభిక్ష పెట్టాలా..? వద్దా..?’ అంటూ నిర్వహించిన గురువారం నాటి పోల్‌లో 72శాతం మంది ఓకే అన్నారు. ఈ ప్రక్రియ వచ్చేవారం నుంచి అమల్లోకి రానుంది.