ప్రపంచ కుభేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్…ట్విట్టర్ ను ఎందుకు కొనుగోలు చేస్తున్నారో చెప్పేశారు. ఈ ఒప్పందం వెనకున్న అసల నిజాన్ని బహిర్గతం చేశారు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ అకౌంట్లో గురువారం ఓ పోస్టు జోడించారు. ఈ పోస్టులో ఫ్లాట్ ఫారమ్ పై ప్రకటనల గురించి తాను ఏమనుకుంటున్నాడో చెప్పారు. నేను ట్విట్టర్ ను ఎందుకు కొనుగోలు చేశాను..అనేదానిపై చాలా ఊహాగానాలు వచ్చాయని..అయితే వాటిలో చాలా వరకు తప్పని రుజువయ్యాయని తన పోస్టులో పేర్కొన్నాడు. భవిష్యత్ నాగరికతలో విభిన్న భావజాలాలు, నమ్మకాలు ఉన్న వ్యక్తులు ఎలాంటి హింస లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన చర్చలు జరపగలిగే ఉమ్మడి డిజిటల్ స్పేస్ ను కలిగి ఉండేందుకే తాను ట్విట్టర్ ను కొనుగోలు చేసినట్లు మస్క్ వెల్లడించారు.
ప్రస్తుతం సోషల్ మీడియా రాడికల్ రైట్, రాడికల్ లెఫ్ట్ ల మధ్య చీలిపోయిన మన సమాజంలో మరింత ద్వేషాన్ని వాప్తి చేసే ప్రమాదం ఉందన్నారు. ఎక్కువ క్లిక్స్ రావాలన్న ఉద్దేశ్యంతో చాలా సంస్థ సంప్రదాయ విలువలు మరిచాయన్నారు. కానీ అలా చేయడం ద్వారా కమ్యూనికేషన్ మరింతగా కోల్పోతుంది. దీంతోపాటు ట్విట్టర్ అత్యంత గౌరవనీయమైన ప్రకటనల వేదికగా ఉండాలని తాను కోరకుంటున్నట్లు మస్క్ తెలిపారు.
Dear Twitter Advertisers pic.twitter.com/GMwHmInPAS
— Elon Musk (@elonmusk) October 27, 2022
డబ్బ సంపాదించడానికి ఒప్పందం చేసుకోలేదు
తాను డబ్బు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో ట్విట్టర్ ను కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. నేను ప్రేమించే మానవత్వం కోసం ఈ ఒప్పందం చేసుకున్నాను. చాలా వినయంతో పనిచేస్తున్నారు. అలాంటి లక్ష్యాలను సాధించాలంటే వైఫల్యాలుకూడా తప్పవు. డెలావేర్ కోర్ట్ ఎలన్ మస్క్ ను ప్రస్తుత నిబంధనలు ప్రకారం అక్టోబర్ 28న శుక్రవారం నాటికి ట్విట్టర్ ఒప్పందాన్ని ఖరారు చేయాలని కోరింది. దీనికి ఒకరోజు ముందు అనగా గురువారం మస్క్ ఈ పోస్టు చేశారు.