Elon Musk: 75 శాతం ట్విట్టర్ ఉద్యోగులపై మస్క్ వేటు..?

హైడ్రామా తర్వాత మళ్లీ ట్విట్టర్ కొనుగోలుకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆ సంస్థ కొనుగోలు పూర్తయితే ఉద్యోగాల్లో భారీ కోత విధించేందుకు సిద్ధపడినట్లు సమాచారం.

  • Written By:
  • Publish Date - October 21, 2022 / 04:33 PM IST

హైడ్రామా తర్వాత మళ్లీ ట్విట్టర్ కొనుగోలుకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆ సంస్థ కొనుగోలు పూర్తయితే ఉద్యోగాల్లో భారీ కోత విధించేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ట్విటర్ లో 75 శాతం మంది (7,500 మందిపైనే) ఉద్యోగులను తప్పించాలని భావిస్తున్నట్లు పెట్టుబడిదారులకు మస్క్ స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు ట్విట్టర్ ఇప్పటికే వచ్చే ఏడాదిలోగా దాదాపు 25 శాతం ఉద్యోగులను తప్పించేలా ప్రణాళికలు చేస్తోంది. నివేదికల ప్రకారం.. కంపెనీ యాజమాన్యం ఎవరిదైనా రాబోయే నెలల్లో ఉద్యోగాల కోత ఉంటుందని భావిస్తున్నారు.

Twitter ప్రస్తుత మేనేజ్‌మెంట్ వచ్చే ఏడాది చివరి నాటికి కంపెనీ పేరోల్‌ను సుమారు $800 మిలియన్లకు తగ్గించాలని యోచిస్తోంది. ఇది దాదాపు 25 శాతం ఉద్యోగుల నిష్క్రమణలను సూచిస్తుందని ఓ నివేదిక పేర్కొంది. ఈ సోషల్ మీడియా సంస్థలోని హెచ్.ఆర్ సిబ్బంది ఉద్యోగులను పెద్దఎత్తున తొలగింపుల కోసం ప్రణాళిక చేయడం లేదని చెప్పారు. అయితే మస్క్ కంపెనీని కొనుగోలు చేయడానికి ముందు నుంచే సిబ్బందిని బయటకు పంపడానికి, మౌలిక సదుపాయాల ఖర్చులను తగ్గించడానికి విస్తృతమైన ప్రణాళికలను రచిస్తోంది ట్విట్టర్. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ట్విట్టర్ లో స్పామ్ ఖాతాల సంఖ్యను తక్కువ చేసిందని ఆరోపిస్తూ ఈ ఏడాది మేలో మస్క్ ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుండి వైదొలగడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మస్క్ మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.